Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ పాకిస్థాన్ లింకులు వెల్లడి!
ABN, First Publish Date - 2023-03-28T15:18:55+05:30
ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ అనుచరుల్లో ఒకరైన దల్జీత్ సింగ్
న్యూఢిల్లీ : ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) అనుచరుల్లో ఒకరైన దల్జీత్ సింగ్ కల్సికి పాకిస్థాన్ మాజీ సైన్యాధిపతి జనరల్ కమర్ జావేద్ బజ్వా (Qamar Javed Bajwa) కుమారుడు సాద్ బజ్వాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాద్ బజ్వాకు దుబాయ్‌లో ఉన్న కంపెనీ నుంచి కల్సికి నిధులు అందినట్లు సమాచారం. అదేవిధంగా ఢిల్లీలోని సుభాశ్ చౌక్‌లో ఉన్న ఓ ‘‘బిగ్ ఫైనాన్షియర్’’ కూడా కల్సి కోసం పని చేసేవారని తెలుస్తోంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, పంజాబీ బాగ్‌లో నివసిస్తున్న దల్జీజ్ సింగ్ కల్సి రెండు నెలల క్రితం దుబాయ్ వెళ్లారు. ఖలిస్థాన్ ఉగ్రవాది లండ హరికే దుబాయ్‌లో కల్సి కోసం ఏర్పాట్లు చేశాడు. లండాను లఖ్‌బిర్ సింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. గత ఏడాది మే 9న మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ దాడికి కీలక సూత్రధారి లండాయేనని తెలుస్తోంది. అమృత్‌సర్, తరన్ తరన్, మొగ, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో హత్య, హత్యాయత్నం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలకు సంబంధించిన 18 కేసులు ఆయనపై నమోదయ్యాయి.
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో కూడా కల్సికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. బంబిహ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలున్న ఓ గ్యాంగ్‌స్టర్‌తో కూడా సాన్నిహిత్యం ఉందని సమాచారం.
కల్సి నటుడు, రచయిత అని తెలుస్తోంది. వారిస్ పంజాబ్ డే చీఫ్‌గా అమృత్‌పాల్‌ను ప్రకటించడం వెనుక ఆయన కృషి ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
Gold and Silver Price : పెరగడమేమో వేలల్లో.. తగ్గితే పైసల్లో..
Adani Group : అదానీ చేతికి మరో ప్రముఖ మీడియా గ్రూప్
Updated Date - 2023-03-28T15:18:55+05:30 IST