DCM: కరువు ఛాయల నేపథ్యంలో.. మళ్లీ తెరపైకి మేఘమథనం
ABN, First Publish Date - 2023-09-26T12:23:24+05:30
రాష్ట్రంలో కరువు ఛాయలు, కావేరి జల వివాదం నడుమ ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వం మేఘమథనం అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది.
- పరిశీలిస్తున్నామన్న డీసీఎం డీకే శివకుమార్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరువు ఛాయలు, కావేరి జల వివాదం నడుమ ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వం మేఘమథనం అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ప్రత్యేకించి కావేరి బేసిన్‌లో మేఘమథనం జరిపేందుకు గల అవకాశాలపై నిపుణులతో చర్చిస్తున్నట్టు జలవనరుల శాఖను నిర్వ హిస్తున్న ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) ప్రకటించారు. బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజులుగా బెంగళూరు నగరం చుట్టుపక్కల కురిసిన వర్షాలతో పరిస్థితి మళ్లీ ఆశాదాయకంగా మారిందన్నారు. మంత్రిమండలి సమావేశంలో మేఘమథనంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీ, జేడీఎస్‌లలోని పలువురు అసంతృప్త నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనారు. అధిష్ఠానం పెద్దలతో చర్చించి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా మొత్త 28 లోక్‌సభ నియోజకవర్గాలకు పరిశీలకులుగా మంత్రులను నియమించామన్నారు. ఎంబీ పాటిల్ విదేశాల్లో ఉన్న కారణంగా కేజే జార్జ్, పార్టీ కేంద్రకమిటీలో ఉన్న కారణంగా మినహాయింపు ఇచ్చామన్నారు. ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన మంత్రులు, మరో పదిరోజుల్లోగా క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో చర్చలు జరుపుతారన్నారు. ఇదే సందర్భంగా ఒక్కో నియోజకవర్గానికి కనీసం 3 పేర్లను సూచించాల్సిందిగా మంత్రులను కోరామన్నారు.
Updated Date - 2023-09-26T12:23:24+05:30 IST