ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DCM: కావేరి ప్రాజెక్టుల్లో నీటి కొరత.. విత్తన పనులు వద్దు..

ABN, First Publish Date - 2023-10-07T13:38:27+05:30

కావేరి జలాశయాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని, ఆయకట్టు రైతులు విత్తన పనులు చేపట్టరాదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(

- ఆయకట్టు రైతులకు డీసీఎం సూచన

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కావేరి జలాశయాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని, ఆయకట్టు రైతులు విత్తన పనులు చేపట్టరాదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) సూచించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతానికి కావేరి నదికి అనుబంధమైన నాలుగు ప్రాజెక్టుల్లోనూ నీటిమట్టం తక్కువగా ఉందన్నారు. ఆయకట్టు రైతులు విత్తన పనులకు ముందుకు వెళ్లరాదన్నారు. విత్తనాలు, నాట్లు వేస్తే కొంతకాలం తర్వాత ఇబ్బంది కలుగవచ్చు అన్నారు. గత మూడురోజుల పాటు కొడుగు జిల్లాలో కురిసిన వర్షాలకు కొంత మేర నీటిమట్టం పెరిగిందన్నారు. అక్టోబర్‌ 1న 13వేల క్యూసెక్కులు, 2న 23 వేలు, 3న 20వేలు, 4న 15వేలు, 5న 10వేల క్యూసెక్కుల మేర కేఆర్‌ఎస్‏కు నీరు చేరిందన్నారు. తమిళనాడుకు రోజూ మూడువేల క్యూసెక్కులు విడుదల చేయలేమని ప్రాజెక్టుల్లో నీరు తగినంత లేదని సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశామన్నారు. మేకెదాటు ప్రాజెక్టు అనుమతుల కోసం ఇప్పటకే నివేదికలు పంపామని చట్టప్రకారం అనుకూలం కానుందని భావిస్తున్నామన్నారు. కావేరి జలాశయాల్లో నీటిమ ట్టం తక్కువగా ఉన్నందున ఆయకట్టు రైతులు నాట్లు వేయకుండా సహకరించాలన్నారు.

Updated Date - 2023-10-07T13:38:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising