ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Joshimath Crisis: జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. సుప్రీంకోర్టులో ద్వారకా పీఠాధిపతి పిటిషన్

ABN, First Publish Date - 2023-01-08T15:03:35+05:30

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగిపోయి, వందలాది ఇళ్లకు పగుళ్లు రావడంతో తలెత్తిన సంక్షోభంపై ద్వారకా పీఠాధిపతి స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ (Joshimath)లో భూమి కుంగిపోయి, వందలాది ఇళ్లకు పగుళ్లు రావడంతో తలెత్తిన సంక్షోభంపై ద్వారకా పీఠాధిపతి స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి (Swami Avimukteswaranand Saraswati) ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని జాతీయ విపత్తు (National disaster)గా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టు (Supreme court)ను ఆయన ఆశ్రయించారు. ఉత్తరాఖండ్ ప్రజలకు తక్షణ ఆర్థిక సాయం, పరిహారం చెల్లించాలని ఆయన తన పిటిషన్‌లో కారారు. పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణే (Industrialisation) ఈ విపత్తుకు కారణమని ఆయన అన్నారు.

''మనుషుల ప్రాణలు, పర్వావరణ వ్యవస్థను పణంగా పెట్టే అభివృద్ధి అవసరం లేదు. అలాంటిది జరిగితే రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం వాటిని యుద్ధ ప్రాతిపదికన నిలిపివేయాలి'' అని స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జోషిమఠ్‌లో పరిస్థితి పెనుముప్పుగా మారిందని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. జోషిమఠ్‌లో భూమి కుంగిపోతోందంటూ సమాజంలోని వివిధ వర్గాల వారు గత ఏడాదిగా సంతాకల సేకరణతో ఉద్యమిస్తున్నారని, అయితే ఎవరూ పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బద్రీనాథ్, హేమ్‌కుండ్ సాహిబ్‌లకు గేట్‌వేగా జోషిమఠ్ ఉంది. కాగా, జోషీమఠ్‌లో ఓ దేవాలయం, కొన్ని ఇళ్లు కూలిపోయిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శనివారం పర్యటించారు. ఈ ప్రభావానికి గురైన సుమారు 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. మరోవైపు భూమి కుంగిపోవడానికి కారణాలేమిటో అత్యంత వేగంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సమస్యపై చర్చించేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Updated Date - 2023-01-08T15:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising