ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi Pollution:యాప్ ఆధారిత క్యాబ్‌లపై నిషేధం విధించిన ఢిల్లీ సర్కార్

ABN, First Publish Date - 2023-11-08T14:55:51+05:30

ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్న వేళ సుప్రీంకోర్టు(Supreme Court) చేసిన కీలక సూచనల తర్వాత ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన యాప్ ఆధారిత క్యాబ్‌(Cabs)ల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు కేజ్రీవాల్(Arving Kejriwal) ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

ఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్న వేళ సుప్రీంకోర్టు(Supreme Court) చేసిన కీలక సూచనల తర్వాత ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన యాప్ ఆధారిత క్యాబ్‌(Cabs)ల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు కేజ్రీవాల్(Arving Kejriwal) ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఢిల్లీ - ఎన్ సీఆర్(Delhi - NCR) పరిధిలో కొంతకాలం నుంచి కాలుష్య తీవ్రత పెరుగుతోంది. కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. అదుపులోకి రావట్లేదు. కాలుష్య తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. కోర్టు సూచనల ప్రకారం చర్యలు తీసుకున్న కేజ్రీవాల్ సర్కార్ దేశ రాజధానిలోకి స్థానిక రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన క్యాబ్ లకు మాత్రమే అనుమతి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది.


ఇవాళ వాయు నాణ్యత తీవ్రమైన స్థాయికి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం, వాయు నాణ్యత సూచిక (AQI) ఉదయం 7 గంటలకు 421 పాయింట్లుగా నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్(NCR)లో అక్టోబర్, నవంబర్ నెలల్లో వాయు కాలుష్య సమస్యతో సతమతమవుతున్న ప్రజల ఆందోళనలను తగ్గించేందుకు సుప్రీంకోర్టు ప్రతి సంవత్సరం అనేక సూచనలు చేస్తోంది. మంగళవారం, ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గహ్లోట్ మాట్లాడుతూ.. GRAP IV కింద పరిమితులు ఉన్నప్పటికీ కాలుష్యం చేస్తున్న వాహనాలు నగరంలోకి తిరుగుతున్నాయన్నారు. అధికారులు తనిఖీలు సరిగ్గా నిర్వహించాలి. రాజధానిలో వాయు నాణ్యత "తీవ్రమైన ప్లస్" (AQI 450 కంటే ఎక్కువ) స్థాయికి పడిపోయిన తర్వాత, GRAP దశ IV కింద అన్ని రకాల నిర్మాణ పనులపై నిషేధం విధించారు. కాలుష్యకారక ట్రక్కుల ప్రవేశాలపై ఆంక్షలు కఠినతరం చేశారు. ఈ పరిస్థితిని సుప్రీంకోర్టు నిశితంగా పరిశీలిస్తోందని.. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

Updated Date - 2023-11-08T14:58:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising