ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kejriwal: ఇది బీజేపీ 'వరద ప్రతీకార' కుట్ర.. వీడియో సాక్ష్యం చూపించిన 'ఆప్'

ABN, First Publish Date - 2023-07-14T21:33:53+05:30

యమునా నది ఉగ్రరూపం దాల్చి దేశరాజధాని ఢిల్లీని ముంచెత్తడంతో పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్భంధంలో ఉన్నాయి. మరోవైపు వరద రాజకీయాలు కూడా షురూ అయ్యాయి. ఢిల్లీలో వరదలకు బీజేపీ కుట్ర చేసిందంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ఇందుకు సంబంధిచిన ఒక వీడియో సాక్ష్యాన్ని విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: యమునా నది (Yamuna River) ఉగ్రరూపం దాల్చి దేశరాజధాని ఢిల్లీని (Delhi) ముంచెత్తడంతో పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్భంధంలో ఉన్నాయి. ప్రమాద స్థాయి కంటే మూడు మీటర్లు ఎక్కువగానే నీటి మట్టం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఒకవైపు పౌరజీవనం స్తంభించిపోగా, మరోవైపు వరద రాజకీయాలు కూడా షురూ అయ్యాయి. ఢిల్లీలో వరదలకు బీజేపీ (Bjp) కుట్ర చేసిందంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శుక్రవారం ఆరోపించింది. హత్నీ కుండ్ బ్యారేజ్ (Hatni kund Barrage) నీటిని ఢిల్లీ వైపు మళ్లించి, షహరాన్‌పూర్ (యూపీ) గుండా వెళ్లే కెనాల్‌ను మూసేశారంటూ ఒక వ్యక్తి ఆరోపించిన వీడియోను ఆప్ ట్వీట్ చేసింది.


దీనిపై ఆప్ ఆద్మీ పార్టీ తన అధికారిక ట్విట్టర్‌లో బీజేపీని తప్పుపట్టింది. ''బీజేపీ లోతైన కుట్రలో భాగంగానే ఢిల్లీ నగరం మునిగిపోయిందా? తమను ఓడించిన ప్రజల ప్రాణాలను వరదల రూపంలో హరించాలని బీజేపీ అనుకుంటోందా? వీటన్నింటికి ఈ వీడియోను చూస్తే సమాధానం దొరుకుతుంది. హత్నీ కుండ్ బ్యారేజ్ నీటిని ఢిల్లీ వైపు మళ్లించడం వెనుక కుట్ర ఉందని అర్ధమవుతుంది. ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ వైపు వెళ్లే కెనాల్ పూర్తిగా ఎండిపోయి ఉండగా, నీటిని అటువైపు మళ్లించకుండా ఢిల్లీ వైపు విడుదల చేయడం ఏమిటంటూ ఆ యువకుడు వీడియోలో ప్రశ్నించడం కనిపిస్తోంది. ఢిల్లీ ప్రజలపై గుడ్డిగా బీజేపీ విద్వేషం కనబరుస్తోంది'' అని ఆ ట్వీట్‌లో ఆప్ తీవ్ర స్థాయిలో విమర్శించింది.


ఇది ప్రజలను ఆదుకోవాల్సిన తరుణం: సీఎం

బీజేపీ వరద రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఆప్ చేసిన విమర్శలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, విమర్శలు, ప్రతివిమర్శలకు ఇది సమయం కాదని, ప్రజలకు ఆదుకోవాల్సిన తరుణమిదని అన్నారు. వరదల్లో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ, ఆప్‌ను ఎందుకు బీజేపీ ఎందుకు ఇంతలా అసహ్యించుకుంటోందని ప్రశ్నించారు. ఢిల్లీ వరదలను బీజీపీ ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఈ తరుణంలో తమ ప్రభుత్వానికి అండగా నిలవాల్సి ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని తప్పుపట్టారు.

Updated Date - 2023-07-14T21:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising