ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదు రోజుల్లో బంగ్లా ఖాళీ చేయాలని సిసోడియాకు గడువు

ABN, First Publish Date - 2023-03-17T17:50:39+05:30

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయి, మంత్రి పదవికి రాజీనామా చేసిన మనీష్ సిసోడియా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ (Delhi Liquor policy) కేసులో అరెస్టయి, మంత్రి పదవికి రాజీనామా చేసిన మనీష్ సిసోడియా (Manish Sisodia) అధికారిక నివాసాన్ని (official residence) ఆయన స్థానంలో మంత్రివర్గంలోకి కొత్తగా తీసుకున్న విద్యాశాఖ మంత్రి అతిషి (Atishi)కి కేటాయించారు. ఈ మేరకు ప్రజాపనుల శాఖ సెక్రటేరియట్ శుక్రవారంనాడు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీలోని మధుర రోడ్డు బంగ్లా నెంబర్ AB-17ను ఖాళీ చేసేందుకు సిసోడియా కుటుంబానికి ఐదు రోజుల సమయం కేటాయించింది.

ఈనెల 14న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఒక అధికారిక లేఖలో ఎనిమిది రోజుల్లోపు తన సమ్మతిని తెలియజేయాలని అతిషిని కోరింది. సిసోడియా ఉంటున్న బంగ్లా నెంబర్ AB-17లో ఇంతకుముందు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉండేవారు. 2015లో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బంగ్లాను సిసోడియాకు కేటాయించారు.

రొటీన్ ప్రక్రియే..

కాగా, బంగ్లాను ఖాళీ చేయించడం రొటీన్ ప్రక్రియేనని, సిసోడియా రాజీనామా చేయడంతో ఆయన బంగ్లాను అతిషికి కేటాయించినట్టు ప్రజాపనుల శాఖ సెక్రటేరియట్ అధికారి ఒకరు తెలిపారు. మార్చి 21వ తేదీలోగా బంగ్లా ఖాళీ చేయాలని ఆ లేఖలో అధికారులు పేర్కొన్నారు. సంబంధిత నిబంధనల ప్రకారం రిటెన్షన్ గడువు 15 రోజులు మాత్రమే ఉంటుందని తెలిపారు.

సిసోడియా, మరో మంత్రి సత్యేంద్ర జైన్ ఇటీవల మంత్రి పదవులకు రాజీనామా చేయడంతో వారి స్థానంలో అతిషి, సౌరభ్ భరద్వాజ్‌ను కేజ్రీవాల్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ విధానం (ప్రస్తుతం రద్దయింది) రూపకల్పన, అమలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో సిసోడియా ఈడీ కస్టడీని మరో ఐదురోజుల పాటు ప్రత్యేక కోర్టు శుక్రవారంనాడు పొడిగించింది.

Updated Date - 2023-03-17T17:53:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising