Delhi Excise Policy: సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ డిసెంబర్ 11 వరకూ పొడిగింపు
ABN, First Publish Date - 2023-11-21T21:04:17+05:30
ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని డిసెంబర్ 11వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది. నిందితులపై పలు డాక్యుమెంట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేయాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణం (Excise policy scam) కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) జ్యుడిషియల్ కస్టడీని డిసెంబర్ 11వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది. నిందితులపై పలు డాక్యుమెంట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేయాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నేరపూరిత కుట్రలో సిసోడియా ప్రమేయం బలంగా ఉందని సీబీఐ ఆరోపిస్తోంది. కాగా, ఈ కేసులో మరో నిందితుడైన బినయ్ బాబు దాఖలు చేసిన తాత్కాలిక బెయిలుపై ఈడీకి కోర్టు నోటీసులు పంపింది. ఈ నెల 24న తమ వాదనలను వినిపించాలని ఈడీని ఆదేశించింది. లిక్కర్ కంపెనీ జనరల్ మేనేజర్‌గా ఉన్న బినయ్‌ను గత ఏడాది నవంబర్‌లో ఈడీ అరెస్టు చేసింది.
Updated Date - 2023-11-21T21:04:18+05:30 IST