ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Mayor election: మళ్లీ అదే రభస.. అదే గొడవ.. మేయర్ ఎన్నిక వాయిదా

ABN, First Publish Date - 2023-01-24T18:46:24+05:30

ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోమారు వాయిదా పడింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కుపై సభలో మళ్లీ గందరగోళం చెలరేగడంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక లేకుండానే సమావేశం ముగిసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోమారు వాయిదా పడింది. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కుపై సభలో మళ్లీ గందరగోళం చెలరేగడంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక లేకుండానే సమావేశం ముగిసింది. ఎన్నికైన కౌన్సిలర్లు, నామినేటెడ్ కౌన్సిలర్లలో ఎవరు ముందు ప్రమాణ స్వీకారం చేయాలన్న విషయంలో ‘ఆప్’(AAP), బీజేపీ(BJP) సభ్యుల మధ్య గతంలో గొడవ జరగడంతో అప్పుడు కూడా మేయర్ (Mayor) ఎన్నిక లేకుండానే సమావేశం వాయిదా పడింది.

అయితే, తొలుత ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించాలని, ఆ తర్వాత నామినేటెడ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాని సోమవారం నిర్ణయించారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరపాలని ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే, ఎంసీడీ హౌస్‌(MCD House)లో సభ ప్రారంభం కాగానే లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి సత్యశర్మ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మేయర్ ఎన్నికకు ఓటింగ్ కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు మరోమారు సభలో గందరగోళం చెలరేగింది. మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసే అధికారం లేదని, కాబట్టి వారు ఓటు వేయడానికి ఒప్పుకోబోమని ఆప్ కౌన్సిలర్ ముకేశ్ గోయల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక లేకుండానే సభను వాయిదా వేశారు.

బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌తో ఆప్ నేతలు అసభ్యంగా ప్రవర్తించారని బీజేపీ కౌన్సిలర్ రాజ్‌పాల్ సింగ్ ఆరోపించారు. దీనిని తాము అడ్డుకోవడంతో సభలో గందరగోళం నెలకొందని, దీంతో ఎంసీడీ హౌస్‌ వాయిదా పడిందని ఆయన పేర్కొన్నారు. అయితే, మేయర్ ఎన్నికను ఈ రోజే నిర్వహించాలని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. ఆప్ అభ్యర్థికి మేయర్ పదవి దక్కడం ఖాయం కావడంతో బీజేపీ భయపడుతోందని అన్నారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌ను ఎన్నుకున్నారని, అయితే బీజేపీ మాత్రం మేయర్ ఎన్నిక జరగనివ్వడం లేదని ఆరోపించారు. ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడడం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెల 6న జరిగిన సమావేశంలోనూ ఇలాగే జరగడంతో అప్పుడు వాయిదా పడింది. ఇప్పుడు మరోమారు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను వాయిదా వేశారు.

Updated Date - 2023-01-24T18:46:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising