ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wrestlers : రెజ్లర్లపై లైంగిక వేధింపులు.. బ్రిజ్ భూషణ్‌పై ఫొటోలు, వీడియోల సాక్ష్యాలు..

ABN, First Publish Date - 2023-06-17T09:56:27+05:30

మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా ఫొటోలు, వీడియో సాక్ష్యాధారాలను ఢిల్లీ పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఆయనపై ఆరుగురు మహిళలు ఫిర్యాదు చేయగా, నలుగురి ఫిర్యాదుల్లో ఫొటో సాక్ష్యాలు, ముగ్గురి ఫిర్యాదుల్లో వీడియో సాక్ష్యాలు ఉన్నట్లు సమాచారం.

Brij Bhushan Sharan Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా ఫొటోలు, వీడియో సాక్ష్యాధారాలను ఢిల్లీ పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఆయనపై ఆరుగురు మహిళలు ఫిర్యాదు చేయగా, నలుగురి ఫిర్యాదుల్లో ఫొటో సాక్ష్యాలు, ముగ్గురి ఫిర్యాదుల్లో వీడియో సాక్ష్యాలు ఉన్నట్లు సమాచారం. ఈ కేసుల్లో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన 1,500 పేజీల ఛార్జిషీటులో ఈ ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది.

మహిళా రెజ్లర్ల ఫిర్యాదులపై నిర్వహించిన దర్యాప్తులో భాగంగా 200 మందికిపైగా సాక్షుల స్టేట్‌మెంట్లను ఢిల్లీ పోలీసులు రికార్డు చేశారు. బాధితుల ఆరోపణలకు బలం చేకూర్చే స్టేట్‌మెంట్లను ఛార్జిషీటులో పొందుపరచి, కోర్టుకు సమర్పించారు. 100 స్టేట్‌మెంట్లు ఈ ఆరోపణలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఫొటోలు, వీడియోలు, కాల్ రికార్డులు వంటి టెక్నికల్ ఎవిడెన్స్‌ను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ ఛార్జిషీటును గురువారం కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టు విచారణ ఈ నెల 22న జరుగుతుంది.

డబ్ల్యూఎఫ్ఐ కార్యాలయం, టోర్నమెంట్లు, క్యాంపులు, ఇతర కార్యక్రమాలు జరిగేటపుడు తమపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పతకాలు పొందిన సందర్భంగా జరిగిన కార్యక్రమాలు, గ్రూప్ ఫొటోలు తీసుకున్న సందర్భాల్లో తీయించుకున్న ఫొటోలు, వీడియోలను ఫిర్యాదుదారులు సమర్పించారని తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనాలు, టోర్నమెంట్ రిఫరీలు, సిబ్బంది, కో-పార్టిసిపెంట్ల స్టేట్‌మెంట్లను కూడా ఛార్జిషీటులో పొందుపరచినట్లు తెలిపారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను అందజేయాలని కోరుతూ ఐదు దేశాల రెజ్లింగ్ ఫెడరేషన్లకు ఢిల్లీ పోలీసులు లేఖలు రాశారు. కానీ ఆ దేశాల నుంచి సమాధానం రాలేదు. ఒకవేళ ఆ దేశాలు స్పందించి, ఆధారాలను సమర్పిస్తే, బ్రిజ్ భూషణ్‌పై అనుబంధ చార్ఝిషీటును దాఖలు చేస్తారు.

రెజ్లర్లపై ఎఫ్ఐఆర్ రద్దుకు యత్నాలు

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు నిరసన తెలుపుతున్న సమయంలో మే 28న జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో రెజ్లర్లకు వ్యతిరేకంగా నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు కోర్టును ఆశ్రయిస్తారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని వీరు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. జూన్ 15నాటికి బ్రిజ్ భూషణ్‌పై ఛార్జిషీటు దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగానే జూన్ 15న బ్రిజ్ భూషణ్‌పై ఛార్జిషీటును ఢిల్లీ పోలీసులు కోర్టులో దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి :

Sexual harassment : మహిళా ఐపీఎస్‌ కు లైంగిక వేధింపులు

Nitish Kumar : మాంఝీపై నితీశ్ కుమార్ తీవ్ర ఆరోపణలు

Updated Date - 2023-06-17T09:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising