ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wrestlers Protest : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ రాజీనామా చేయాలి.. రెజ్లర్లకు రైతు నేతల మద్దతు..

ABN, First Publish Date - 2023-05-07T14:48:36+05:30

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ (Wrestling Federation of India (WFI) chief Brij Bhushan Singh) రాజీనామా చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ (Wrestling Federation of India (WFI) chief Brij Bhushan Singh) రాజీనామా చేయాలని మహిళా రెజ్లర్లు చేస్తున్న డిమాండ్‌కు రైతు సంఘాల నేతలు మద్దతు పలికారు. ఢిల్లీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, రాకేశ్ తికాయత్, దర్శన్ పాల్, హనన్ మొల్లా వంటి రైతు సంఘాల నేతలు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న మహిళా రెజ్లర్లను కలిశారు. తమ మద్దతుదారులతో కలిసి వచ్చిన ఈ నేతలు మహిళా రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించారు.

ఖాప్ ప్రెసిడెంట్ పాలం చౌదరి సురేందర్ సోలంకి మాట్లాడుతూ, మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగుతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమాలను ఏ విధంగా మరింత ముందుకు తీసుకెళ్లాలో త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన కమిటీ నివేదికను బయటపెట్టడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ డబ్ల్యూఎఫ్ఐ తన కార్యకలాపాలను పునఃప్రారంభించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధర్నాలో పాల్గొన్నవారిలో రెజ్లర్లు బజ్రంగ్ పూనియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ తదితరులు ఉన్నారు.

ఉరి వేసుకుంటా : సింగ్

మహిళా రెజ్లర్ల ఆరోపణలపై బ్రిజ్ భూషణ్ సింగ్ స్పందించారు. తనకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణల్లో కనీసం ఒకటి రుజువైనా తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు. ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ సమయంలో తాను మరిన్ని వివరాలను మాట్లాడలేనని చెప్పారు. తనకు వ్యతిరేకంగా కనీసం ఒక వీడియో కానీ, ఏదైనా సాక్ష్యం కానీ ఉన్నట్లయితే మహిళా రెజ్లర్లు బయటపెట్టాలని తాను మొదటి నుంచి చెప్తున్నానన్నారు. ‘‘బ్రిజ్ భూషణ్ రావణాసురుడా? అని రెజ్లింగ్‌‌తో సంబంధం ఉన్నవారిని ఎవరినైనా అడగండి’’ అని చెప్పారు. ‘‘నేను ఏదైనా తప్పు చేశానా? అని ధర్నా చేస్తున్నవారిని కాకుండా ఇతరులను అడగండి’’ అన్నారు. తాను రెజ్లింగ్ కోసం, దేశం కోసం 11 ఏళ్ళపాటు తన జీవితాన్ని అంకితం చేశానని చెప్పారు.

ఏడుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 28న కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఇది తమ తొలి విజయమని మహిళా రెజ్లర్లు ప్రకటించారు. మహిళా రెజ్లర్లకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా శనివారం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి :

Balineni Row : మొన్న అలక.. నిన్న కంటతడి.. ఇప్పుడు బాలినేని పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేయండి..!

Shashi Tharoor: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన: శశిథరూర్ డిమాండ్

Updated Date - 2023-05-07T14:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising