ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dengue: అమ్మో.. బాగానే పెరుగుతోందిగా.. ప్రతి రోజూ 30 మందికి ‘డెంగ్యూ’..

ABN, First Publish Date - 2023-09-29T13:21:21+05:30

రాష్ట్రంలో డెంగూ(Dengue) జ్వర పీడితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వివిధ రకాల జ్వరాలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారిలో

- ధర్మపురి ఆస్పత్రిలో చిన్నారి మృతి

అడయార్‌(చెన్నై), (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డెంగూ(Dengue) జ్వర పీడితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వివిధ రకాల జ్వరాలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారిలో రోజుకు కనీసం 30 మంది డెంగ్యూ బాధితులున్నట్లుగా తేలుతోంది. ప్రధానంగా రాజధాని నగరం చెన్నై(Chennai)తో పాటు తిరునెల్వేలి, తెన్‌కాశి జిల్లాల్లో జ్వర పీడితుల సంఖ్య అధికంగా ఉన్నట్టు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ జ్వరం బారినపడే వారి సంఖ్య గత నెల నుంచి క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. సెప్టెంబరు మొదటి వారం నుంచి జ్వర పీడితుల సంఖ్య మరింత ఎక్కువైంది. దీంతో అప్రమత్తమైన వైద్య వర్గాలు... డెంగ్యూ జ్వరానికి కారణమైన దోమల వ్యాప్తికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యేక అధికారుల నియామకం

రాష్ట్రంలో డెంగ్యూ జ్వరం బారినపడే వారి సంఖ్య పెరుగుతుండటంతో తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారులను నియమించింది. ఒక్కో అధికారికి మూడు లేదా నాలుగు జిల్లాల చొప్పున కేటాయించి, ఆయా జిల్లాల్లో డెంగ్యూ దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో ఉన్న ఈ పత్యేక అధికారులు తమ కేటాయించిన జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించారు.

డెంగ్యూ జ్వరానికి బాలిక మృతి

తిరుపత్తూరు జిల్లా శివరాజ్‌పేటకు చెందిన అబినిధి అనే చిన్నారి డెంగూ జ్వరంతో ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందింది. శివరాజ్‌పేట ప్రాంతానికి చెందిన మణికంఠన్‌, సుమిత్ర దంపతులకు ప్రీతికా (15), తారణి (13), యోగలక్ష్మి (7), అబినిధి (4), పురుషోత్తమన్‌ అనే ఎనిమిది నెలల చిన్నారితో కలిసి మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో యోగలక్ష్మి, అబినిధి, పురుషోత్తమన్‌ డెంగూ జ్వరం బారినపడ్డారు. దీంతో మొదట తిరుపత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ, వారి ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోవడంతో యోగలక్ష్మిని బెంగుళూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి, అబినిధిని ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో అబినిధి బుధవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

Updated Date - 2023-09-29T13:21:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising