ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dengue: వామ్మో.. బాగానే పెరిగిందిగా... చెన్నైని వణికిస్తున్న డెంగ్యూ

ABN, First Publish Date - 2023-10-01T07:48:51+05:30

రాజధాని నగరం చెన్నైలో రోజు రోజుకు జ్వరపీడితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పగటిపూట ఎండలు, రాత్రిపూట వానలతో కూడిన

- ఒకే రోజు 54 మందికి అస్వస్థత

- ఆరోగ్య మంత్రి ప్రకటన

- మేట్టూరులో 50 మంది ట్రైనీ పోలీసులకు జ్వరం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరం చెన్నైలో రోజు రోజుకు జ్వరపీడితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పగటిపూట ఎండలు, రాత్రిపూట వానలతో కూడిన వింత వాతావరణ పరిస్థితుల కారణంగా అన్ని చోట్లా మురుగునీరు చేరి దోమలు స్వైరవిహారం చేస్తుండటంతో డెంగ్యూ జ్వరాలు ప్రబలినట్టు చెబుతున్నారు. శనివారం నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిపిన వైద్య పరీక్షల్లో 54 మందికి డెంగ్యూ జ్వరలక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రమణ్యం(Health Minister M. Subramaniam) ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... డెంగ్యూ జ్వరాల వ్యాప్తిని నిరోధించేందుకు తమ శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గతేడాది 2.65లక్షల మందికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించినప్పుడు 6430 మందికి జ్వరం ఉందని తేలిందన్నారు. ఈ యేడాది ఇప్పటివరకూ 2.42లక్షల మందికి పరీక్షలు జరపగా, 4524 మందికి లక్షణాలున్నట్టు నిర్ధరణ అయ్యిందన్నారు. శుక్రవారం నగరంలో 15 మందికి డెంగ్యూ జ్వరాలు(Dengue fever) సోకినట్లు నిర్ధారించగా, శనివారం 54 మందికి ధృవీకరించామన్నారు. నగరమంతటా మురుగునీరు నిల్వ ఉండే ప్రాంతాలుగా గుర్తించిన 17లక్షల జన నివాస ప్రాంతాల్లో దోమల నిర్మూలన కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులు ఈ ప్రాంతాల్లో మురుగునీటిలో దోమల ఉత్పత్తిని నిరోధించే మందు గుళికలు చల్లటంతోపాటు, బ్లీచింగ్‌ పౌడర్‌, ఫినాయిల్‌ను పిచికారీ చేయనున్నారని వివరించారు. అదే విధంగా ఇళ్ల వద్ద పాత టైర్లు, పగిలిన పూలకుండీలు తదితర వ్యర్థాలను కూడా తొలగిస్తారన్నారు. ఈ డెంగ్యూ నిరోధక కార్యక్రమాల్లో నగరమంతటా 318మంది ఆరోగ్యసిబ్బంది, 635 మంది నర్సులు, 954 మంది పారిశుధ్య కార్మికులు, 2324 మంది కాంట్రాక్టు కార్మికులు పాల్గొంటున్నారని మంత్రి సుబ్రమణ్యం వివరించారు.

మేట్టూరు పోలీసు శిక్షణ సంస్థలో...

సేలం జిల్లా మేట్టూరులోని పోలీసు శిక్షణ సంస్థలో సుమారు 50 మంది పోలీసులకు వింత జ్వరాలు సోకినట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 14 మంది తీవ్ర అస్వస్థతకు గురికావటంతో ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ అర్హత పరీక్షల్లో ఎంపికైన వారికి మేట్టూరు శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తుంటారు. ప్రస్తుతం ఆ సంస్థలో 492 మంది శిక్షణ పొందుతున్నారు. ఇటీవల వినాయకచవితి సందర్భంగా వీరు తిరుప్పూరు, గాంగేయం, కోయంబత్తూరు తదితర నగరాలకు బందోబస్తు డ్యూటీకి వెళ్ళి తిరిగొచ్చారు. అప్పటి నుంచి వీరిలో పలువురు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా 50 మంది పోలీసులు వింత జ్వరాలు సోకి అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచి వైద్యులు చికిత్సలందిస్తున్నారు.

Updated Date - 2023-10-01T07:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising