ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cyclone Mocha: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం...అండమాన్ అప్రమత్తం

ABN, First Publish Date - 2023-05-10T13:46:18+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలపడి వాయుగుండంగా మారనుంది....

Cyclone Mocha
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలపడి వాయుగుండంగా మారనుంది.(Bay of Bengal) దీంతో అండమాన్ దీవుల్లో(Andaman) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక(alert) జారీ చేశారు.మత్స్యకారులు, చిన్న ఓడలు, పడవలు, ట్రాలర్ల నిర్వాహకులు ఆగ్నేయ, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలోకి చేపలవేటకు వెళ్లవద్దని సూచించారు.మే 12వతేదీ ఉదయం వరకు అల్పపీడనం మొదట ఉత్తర వాయువ్య దిశగా బంగ్లాదేశ్-మయన్మార్ తీరాల వైపు కదులుతుందని అంచనా.

ఈ అల్పపీడనం బుధవారం తుఫానుగా మారుతుందని వాతావరణ కార్యాలయం తెలిపింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.ఈ అల్పపీడనం రానున్న 12 గంటల్లో మోచా తుఫానుగా(Cyclone Mocha) మారుతుందని, గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.అండమాన్,నికోబార్ దీవుల్లో మంగళవారం నుంచి గురువారం వరకు చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Updated Date - 2023-05-10T13:46:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising