ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Deputy CM: బంద్‌ అవసరం లేదు: డీసీఎం

ABN, First Publish Date - 2023-09-29T07:42:19+05:30

కావేరి విషయంలో కర్ణాటక రాష్ట్ర బంద్‌ అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) తెలిపారు.

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కావేరి విషయంలో కర్ణాటక రాష్ట్ర బంద్‌ అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) తెలిపారు. గురువారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆందోళన చేసే వారికి అడ్డు చెప్పేది లేదన్నారు. సుప్రీం కోర్టు బంద్‌ చేయరాదని ఆదేశించిందని, బాధ్యత కలిగిన వారు అర్థం చేసుకుంటారన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సి ఉందన్నారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా చూడాల్సి ఉందన్నారు. బంద్‌కు అవకాశమే లేదన్నారు. ఆందోళన చేసుకోవచ్చునని కానీ బంద్‌ చేయరాదన్నారు. శుక్రవారం కావేరి నీటి నిర్వహణా మండలి సభ ఉందన్నారు. అధికారులకు హాజరయ్యేలా సూచించామన్నారు. వర్చువల్‌ రూపంలో కాకుండా నేరుగా పాల్గొంటారన్నారు. సభలో తీసుకునే నిర్ణయాలపై న్యాయ, జలవనరుల నిపుణులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2023-09-29T07:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising