లండన్‌లో ఖలిస్థాన్వాదుల ధర్నా
ABN, First Publish Date - 2023-10-03T02:08:07+05:30
ఇక్కడి భారత రాయబార కార్యాలయం ముందు సోమవారం ఖలిస్థాన్ మద్దతుదార్లు ధర్నా జరిపారు...
లండన్, అక్టోబరు 2: ఇక్కడి భారత రాయబార కార్యాలయం ముందు సోమవారం ఖలిస్థాన్ మద్దతుదార్లు ధర్నా జరిపారు. ప్లకార్డులు పట్టుకొని భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు. బ్రిటిష్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులు ఆ కార్యాలయానికి మరోవైపు ఉన్న రోడ్డు వైపునకు వెళ్లకుండా నియంత్రించారు. కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను ఇండియా ఏజెంట్లు హత్య చేశారంటూ ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ నిరసన ప్రదర్శన జరిపారు. ఇటీవల గ్లాస్గోలోని గురుద్వారాకు వెళ్లకుండా బ్రిటన్‌లోని భారత రాయబారి విక్రం దొరైస్వామిని అడ్డుకున్న ఖలిస్థాన్వాదులు తాజాగా ఈ ఆందోళన చేయడం గమనార్హం.
Updated Date - 2023-10-03T02:08:11+05:30 IST