Karnataka Results: బరిలో కాలు పెట్టకుండానే భలే గెలిచాడు.. విస్తుపోయేలా చేసిన కాంగ్రెస్ అభ్యర్థి విజయం !
ABN, First Publish Date - 2023-05-13T18:26:13+05:30
బెంగళూరు: కర్ణాటక(Karnataka) శాసనసభ ఎన్నికల్లో(Assembly Elections) కన్నడ ప్రజలు బీజేపీ(BJP)ని చిత్తుగా ఓడించి, కాంగ్రెస్(Congress)కు పట్టం కట్టారు. ఎగ్జిట్‌పోల్స్ ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుని అధికారం చేపట్టబోతోంది.
బెంగళూరు: కర్ణాటక(Karnataka) శాసనసభ ఎన్నికల్లో(Assembly Elections) కన్నడ ప్రజలు బీజేపీ(BJP)ని చిత్తుగా ఓడించి, కాంగ్రెస్(Congress)కు పట్టం కట్టారు. ఎగ్జిట్‌పోల్స్ ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుని అధికారం చేపట్టబోతోంది.
ఈ నేపథ్యంలో ధార్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అనూహ్య గెలుపు కన్నడ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ధార్వాడ రూరల్(Dharwad Rural) నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి వినయ్ కులకర్ణి ధార్వాడ నియోజకవర్గం (Dharwad Constituency) నుంచి ఘనవిజయం సాధించారు. వినయ్ కులకర్ణి కనీసం నామినేషన్ వేసేందుకు కూడా వెళ్లలేదు..ఏ ఒక్కచోటా ప్రచారం చేయలేదు. అయిన ప్రత్యర్థి బీజేపీ(BJP) అభ్యర్థి అమృత్ అయ్యప్ప దేశాయ్(Amrut Ayyappa Desai)పై 18,114 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. వినయ్ కులకర్ణికి 88,660 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి అమృత్ అయ్యప్ప దేశాయ్‌కు 70,546 ఓట్లు వచ్చాయి.
కాగా ధార్వాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వినయ్ కులకర్ణి ఆదినుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వినయ్ కులకర్ణి కోర్టు ఉత్తర్వుల దృష్ట్యా నామినేషన్ పత్రాలు సమర్పించలేకపోయారు. ఒక్కరోజు కూడా క్యాంపెయిన్ నిర్వహించలేదు. అయినప్పటికీ వినయ్ కులకర్ణి భారీ మెజార్టీతో గెలుపొందారు. వినయ్ కులకర్ణి తరపున అతని కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహించారు.
ధార్వాడ్ రూరల్ సెగ్మెంట్లో కాంగ్రెస్ తరపున రెండుసార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన వినయ్ కులకర్ణి మొదటి నుంచి ఇబ్బందికర పరిస్థితిస్థిని ఎదుర్కొన్నారు. ధార్వాడ జిల్లా కలెక్టర్ యోగీష్ గౌడ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వినయ్ ధార్వాడ జిల్లాలోకి ప్రవేశించకుండా కోర్టు నిషేధించింది. అంతేకాదు ఎన్నిక ప్రచారం నిర్వహించేందుకు కోర్టు అనుమతి నిరాకరించింది. దీంతో వినయ్ కులకర్ణి సతీమణి శివలీల తన మద్దతుదారులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కేవలం కులకర్ణి వీడియో, ఆడియో కాల్స్ ద్వారా ఓటర్లకు చేరువయ్యారు.
అయితే ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అమృత్ దేశాయ్ మాత్రం దర్వాడ్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. సీఎం బసవరాజ్ బొమ్మై, నటుడు సుదీప్, బీజేపీ పార్లమెంటరీ బోర్టు సభ్యుడు బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ వంటి హెమాహెమీలు అమృత్ దేశాయ్ తరపున ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ వినయ్ కులకర్ణి భారీ విజయాన్ని సాధించారు.
Updated Date - 2023-05-13T18:26:13+05:30 IST