ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Digvijay: వెనక్కి తగ్గని దిగ్విజయ్..మోదీ సర్కార్‌కు 5 సూటి ప్రశ్నలు

ABN, First Publish Date - 2023-01-24T20:04:57+05:30

సాయుధ బలగాలపై తనకు ఎంతో గౌరవం ఉందని, తన ప్రశ్నలన్నీ మోదీ ప్రభుత్వంపైనేనని కాంగ్రెస్ సీనియర్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. బాలాకోట్ వాయుదాడులపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సాయుధ బలగాలపై తనకు ఎంతో గౌరవం ఉందని, తన ప్రశ్నలన్నీ మోదీ ప్రభుత్వంపైనేనని కాంగ్రెస్ సీనియర్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. బాలాకోట్ వాయుదాడులపై ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రక్షణ శాఖ అధికారులకు తాను ప్రశ్నించడం లేదని, తన ప్రశ్నలన్నీ మోదీ సర్కార్‌పైనేనని అన్నారు. తన సోదరీమణులు ఇద్దరూ నేవీ అధికారులనే పెళ్లి చేసుకున్నారని, రక్షణ అధికారులను తాను ప్రశ్నించడమనే ప్రసక్తే లేదని చెప్పారు.

''మోదీ ప్రభుత్వాన్ని కొన్ని విలువైన ప్రశ్నలు అడుగుతున్నాను. బాధ్యతగల పౌరుడిగా వాస్తవాలు తెలుసుకునే హక్కు నాకు లేదా? తీవ్రమైన తప్పిదాలు జరిగితే ఎవర్ని శిక్షిస్తారు? మిగతా ఏ దేశంలోనైనా హోం మంత్రి చేత రాజీనామా చేయించేవారు'' అని దిగ్విజయ్ అన్నారు. తన ప్రశ్నలకు మోదీ సర్కార్ సమాధానం చెప్పాలని అన్నారు.

మోదీ సర్కార్‌కు 5 సూటి ప్రశ్నలు..

1.ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది వీరమరణం పొందారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?

2.ఉగ్రవాదులకు 300 కిలోల ఆర్‌డీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది?

3.సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని వాయుమార్గంలో తరలించాలంటూ సీఆర్‌పీఎఫ్ చేసిన విజ్ఞప్తిని ఎందుకు నిరాకరించారు?

4.ఉగ్రవాదులతో సహా జమ్మూకశ్మీర్ పోలీసులకు పట్టుబడిన పుల్వామాకు చెందిన డిప్యూటీ ఎస్‌పీని ఎందుకు వదిలిపెట్టేశారు?

5.ఉగ్రవాద ప్రభావిత ప్రాంతమైన పుల్వామాలో దాడి జరిగిన రోజు వాహనాలను ఎందుకు క్షుణ్ణంగా తనిఖీ చేయలేదు?

Updated Date - 2023-01-24T20:08:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising