ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amit Shah: 'ఢిల్లీ కా దర్బార్' చేసిందేమీ లేదు: అమిత్‌షా

ABN, First Publish Date - 2023-09-02T18:26:35+05:30

ఛత్తీస్‌గఢ్‌కు 'ఢిల్లీ కా దర్బార్' చేసిన మంచి ఏదీ లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అధికార మార్పు కోసం మాత్రమే కాదని, ఛత్తీస్‌గఢ్ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని చెప్పారు.

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌కు 'ఢిల్లీ కా దర్బార్' (Dilli Ka Darbaar) చేసిన మంచి ఏదీ లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అధికార మార్పు కోసం మాత్రమే కాదని, ఛత్తీస్‌గఢ్ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని చెప్పారు. ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ అవినీతి ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలా, అభివృద్ధికి పెద్దపీట వేసే బీజేపీకి ఓటు వేయాలా అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు. గాంధీ కుటుంబాన్ని ఢిల్లీ కా దర్బార్‌గా ఆయన సంబోధిస్తూ, రాష్ట్రానికి ఢిల్లీ కా దర్బార్ చేసిందేమీ లేదని, బీజేపీ మాత్రమే అవినీతి నుంచి రాష్ట్రాన్ని కాపాడగలదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అరోపణల జాబితాను విడుదల చేసేందుకు ఆదివారంనాడు రాయపూర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


''బీజేపీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు, అభివృద్ధి దిశగా నడిపిస్తుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై ప్రజలను జాగృతం చేసేందుకు ''ఆరోప్ పత్ర''ను ఈరోజు విడుదల చేస్తున్నాం. రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకోవడం మినహా వాళ్లు (కాంగ్రెస్) చేసిందేమీ లేదు'' అని అమిత్‌షా విమర్శించారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం రమణ్ సింగ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారనీ, ఇంటింటికీ ఉచిత రేషన్ ఇచ్చారని, ప్రజలు ఆయనను 'చావల్ వాలా బాబా'గా ఆప్యాయంగా పిలుచుకుంటారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు 50 శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌కు ఎడ్యుకేషన్ హబ్‌గా, పవర్‌, సిమెంట్, అల్యూమినియం హబ్‌గా గుర్తింపు తెచ్చామని అన్నారు.


రాష్ట్రానికి భూపేష్ బఘెల్ చేసిందేమీ లేదని, పేదలను దోచుకుని గాంధీ కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేశారని అమిత్‌షా విమర్శిచారు. అధికారంలో ఉన్న ఇన్ని ఏళ్లలో ఆయన ఏమి చేశారో చెప్పాలన్నారు. కనీసం ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఆయనకు గుర్తులేవని అన్నారు.


బీజేపీకి పట్టంకట్టండి..

2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 11 సీట్లలో 10 సీట్లలో ప్రజలు తమను గెలిపించారని, ప్రజలు తమను మరోసారి ఆశీర్వదించాలని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ, వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ చేరుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


ఆరోపణ్ పత్ర...

బీజేపీ విడుదల చేసిన ఆరోపణల పత్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలిజాన్ని ప్రోత్సహించిందని, బీజేపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకుందని ఆరోపించింది. రాష్ట్రంలో 200 ఫుడ్ పార్కులు నిర్మిస్తామని వాగ్దానం చేసి కనీసం ఒక్కటి కూడా నిర్మించలేదని పేర్కొంది.

Updated Date - 2023-09-02T18:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising