Diwali: దీపావళికి ఊళ్లకు వెళ్ళేందుకు 70 వేల మంది రిజర్వేషన్
ABN, First Publish Date - 2023-11-01T11:02:23+05:30
దీపావళి పండుగకు సొంతూర్లకు వెళ్ళేందుకు సుమారు 70 వేల మంది నగర వాసులు రిజర్వేషన్ చేసుకున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ(State Transport Department) అధికారులు వెల్లడించారు.
అడయార్(చెన్నై): దీపావళి పండుగకు సొంతూర్లకు వెళ్ళేందుకు సుమారు 70 వేల మంది నగర వాసులు రిజర్వేషన్ చేసుకున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ(State Transport Department) అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, దీపావళి పండుగ కోసం ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ప్రతి రోజూ నడిపే 2100 బస్సులతో పాటు అదనంగా 4675 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు వారు తెలిపారు. దీపావళికి మొత్తంగా 10975 బస్సులను నడిపేలా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. అలాగే, ఇతర ప్రాంతాల నుంచి మూడు రోజుల్లో 5920 బస్సులను నడుపున్నట్టు వెల్లడించారు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజూ నడిపే 2100 బస్సులతో పాటు 3167 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు వారు తెలిపారు. ఇలా మూడు రోజుల పాటు మొత్తం 9467 బస్సులను నడుపుతామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి నడిపే మరో 3825 బస్సులతో కలుపుకుని మొత్తం 13292 బస్సులను నడిపేలా చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ బస్సుల్లో ప్రయాణించేదుకు 70 వేల మంది ముందస్తు రిజర్వేషన్ చేసుకున్నారని వారు తెలిపారు.
Updated Date - 2023-11-01T11:02:23+05:30 IST