DK Shivakumar: డీసీఎం శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. నేనైతే వెనకడుగు వేసేవాణ్ణి కాదు
ABN, First Publish Date - 2023-06-30T12:38:35+05:30
గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వంలో బెంగళూరులోని బసవేశ్వర సర్కిల్ నుంచి హెబ్బాళ్ వరకు స్టీల్ బ్రిడ్జ్ నిర్మించాలనే ప్రతిపాదనలు తీసుకొచ్చి
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వంలో బెంగళూరులోని బసవేశ్వర సర్కిల్ నుంచి హెబ్బాళ్ వరకు స్టీల్ బ్రిడ్జ్ నిర్మించాలనే ప్రతిపాదనలు తీసుకొచ్చి చివరిక్షణంలో సీఎం సిద్దరామయ్య వాయిదా వేసుకున్నారని, తానైతే వెనుకడుగు వేసేవాణ్ణి కాదని డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) అభిప్రాయపడ్డారు. ఇటీవల రెండు బహిరంగసభల్లో డీసీఎం డీకే శివకుమార్ ఆలోచించేలాంటి అంశాలను ప్రస్తావించారు. మంగళవారం నాడప్రభు కెంపేగౌడ జయంతి రోజున విధానసౌధలో జరిగిన కార్యక్రమంలో డీసీఎం మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ పెను సవాల్‌గా మారుతోందని ఐదేళ్లక్రితమే 6.7 కిలోమీటర్ల మేర స్టీల్‌బ్రిడ్జ్(Steelbridge) నిర్మించాలని తీర్మానించారన్నారు. విమర్శలు రావడంతో బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కేజే జార్జ్ సూచనతో సీఎం సిద్దరామయ్య వెనుకడుగు వేశారన్నారు. నేను తీసుకునే నిర్ణయమై ఉంటే ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా ముందుకే వెళ్లేవాడినన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు సొరంగ మార్గాలు ఏర్పాటు చేయదలిచామని, నమ్మ మెట్రో సేవలు విస్తరింప చేయదలిచామన్నారు. నెలమంగలలో కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతుల చర్చాగోష్టిలో పాల్గొన్న డీకే శివకుమార్ మాట్లాడుతూ బీజేపీవారు జైలుకు పంపారని, బెయిల్‌పై వెనుదిరిగి వస్తే 60-70వేలమందికిపైగా స్వాగతించారన్నారు. అయితే తాను ఎవరి చెంతన ఉన్నానో వారే తనను చూసేందుకు తీహార్ జైలుకు రాలేదన్నారు. పరోక్షంగా హితశత్రువులు ఉన్నారని వ్యాఖ్యానించారు. రెండు అంశాలలోనూ టార్గెట్ చేసినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - 2023-06-30T12:38:35+05:30 IST