ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DK Shivakumar: ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు.. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు సింగపూర్‌లో కుట్ర

ABN, First Publish Date - 2023-07-25T12:23:05+05:30

తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సింగపూర్‌లో కుట్ర జరుగుతోందని, తనకు తగిన సమాచారం ఉందని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సింగపూర్‌లో కుట్ర జరుగుతోందని, తనకు తగిన సమాచారం ఉందని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) పేర్కొన్నారు. కొందరు సింగపూర్‌లో కూర్చుని ఏం చేస్తున్నారనేది తనకు తెలుసన్నారు. సోమవారం సదాశివనగర్‌లోని ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ సింగపూర్‌లో ఎటువంటి చర్యలకు ప్రయత్నిస్తున్నారనేది తమ సన్నిహితుల ద్వారా తెలుసిందన్నారు. బెంగళూరులో ఏ విధమైన ప్రక్రియ జరిగినా వెంటనే సమాచారం తెలిసిపోతుందని విదేశాల్లో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైద్య పరీక్షల కోసం జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్‌కు వెళ్లిన నేపథ్యంలోనే డీకే శివకుమార్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి కుట్రలకు బెదరేది లేదన్నారు. ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారనేది, తమకు తగిన సమాచారం ఉందన్నారు. కాగా సీఎంను చేయడం తెలుసు, కూల్చడం కూడా తెలుసని సీనియర్‌ నేత బీకే హరిప్రసాద్‌(BK Hariprasad) చేసిన వ్యాఖ్యలపై డీసీఎం స్పందించారు. రాజకీయాల్లో అంద రూ సమానమని, ఏ కులాన్ని తక్కువ చేసే ప్రక్రియ కాంగ్రెస్‌ నుంచి జరగదన్నారు. బీకే హరిప్రసాద్‌ ఏం మాట్లాడారో... తనకు పూర్తిగా తెలియదని కావున ఆ అంశం గురించి మాట్లాడనన్నారు. ఆయన పార్టీలో క్రమశిక్షణ కల్గిన నాయకుడని మంత్రి రామలింగారెడ్డి అభిప్రాయపడ్డారు. బొమ్మసంద్ర పారిశ్రామికవేవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ కార్యదర్శిగా రెండు దశాబ్దాలుగా కొనసాగిన బీకే హరిప్రసాద్‌ వ్యాఖ్యలు కర్ణాటకకు సంబంధించినవి కావన్నారు. కాగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ మైసూరులో మాట్లాడుతూ బీకే హరిప్రసాద్‌ సీనియర్‌ నేత అని, పార్టీ వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయరన్నారు.

Updated Date - 2023-07-25T12:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising