DK Shivakumar: మీకు దమ్ముంటే నిరూపించండి.. రాజీనామా చేస్తా..
ABN, First Publish Date - 2023-08-12T10:48:19+05:30
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని తనపై ఆరోపణలు చేసిన మాజీ సీఎం బసవరాజ్‌బొమ్మై,
- డీసీఎం డీకే శివకుమార్ సవాల్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని తనపై ఆరోపణలు చేసిన మాజీ సీఎం బసవరాజ్‌బొమ్మై, మాజీ మంత్రి అశోక్‌లు అందుకు సిద్ధమా? అంటూ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) సవాల్ విసిరారు. శుక్రవారం సదాశివనగర్‌లోని నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు మీడియా ముందుకు రావడంపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు అన్నారు. కాంట్రాక్టర్లు ఎవరికి ఎంత ఇచ్చారననేది ప్రస్తావించేది లేదన్నారు. కానీ 10-15శాతం కమీషన్ ఎవరు అడిగారు, ఎవరు ఇచ్చారనేది ముఖ్యమన్నారు. సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అడిగారా లేక మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారా అనేది ముఖ్యమన్నారు. నేను కమీషనర్ కోరి ఉంటే ఈక్షణంలోనే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానన్నారు. అశోక్ మాట్లాడింది చూశానన్నారు. 1.25లక్షల ఓట్ల తేడాతో ఓడిన డిపాజిట్ కోల్పోయారు. ఇంకేం కావాలని ప్రశ్నించారు. అజ్జయ్య మఠంలో ప్రమాణంకు డిమాండ్‌పై దారిలో పోయేవారి ప్రతిపాదనలను పట్టించుకునేది లేదంటూనే ఎవరికి ఎక్కడ సమాధానం చెప్పాలో తెలుసన్నారు. నిన్నమొన్నటి దాకా అధికారంలో ఉండే బసవరాజ్‌బొమ్మై(Basavarajbommai) ఎందుకు బిల్లులు చెల్లించలేదని ప్రశ్నించారు. నిధుల కొరతనా లేక నాసిరకం పనులా అనేది బహిరంగం చేయాలన్నారు. అధికారంలో నిర్లక్ష్యం చేసి ఇప్పుడు విమర్శలు చేయడమే విధిగా పెట్టుకున్నారన్నారు. బిల్లుల కోసం నాలుగైదేళ్ళు వేచి ఉండిన వారు నెలల పాటు ఆగలేరా అంటూ ధీటుగా సమాధానమిచ్చారు. కమీషన్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగు తుండడం, సవాళ్లు, ప్రతి సవాళ్లతో కీలక నాయకులు వాగ్వాదం చేస్తుండంతో అందరి దృష్టి దీనిపైనే మళ్లింది. సీఎం సిద్దరామయ్య చర్యలపై ఆసక్తి నెలకొంది.
Updated Date - 2023-08-12T10:48:19+05:30 IST