ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DK Shivakumar: ఇంతకాలం ఆ ఆప్యాయత ఏమైందో...

ABN, First Publish Date - 2023-03-01T11:38:49+05:30

ఎన్నికలు వస్తున్నాయంటే రెక్కలు కట్టుకుని వాలిపోవడం ప్రధాని మోదీకి అలవాటుగా మారిందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- నాడు వద్దు ... నేడు ముద్దా ..!

- యడ్డీపై ప్రేమ ఇప్పుడెందుకో

- డీకే శివకుమార్‌ ఎద్దేవా

బెంగళూరు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు వస్తున్నాయంటే రెక్కలు కట్టుకుని వాలిపోవడం ప్రధాని మోదీకి అలవాటుగా మారిందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(DK Shivakumar) పేర్కొన్నారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ, మాజీ సీఎం యడియూరప్పపై టన్నుల కొద్దీ ఆప్యాయత కురిపించడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆ ప్రేమ యడియూరప్ప(Yeddyurappa)పై కానే కాదని రానున్న ఎన్నికల్లో లింగాయత్‌ ఓట్లపైనేనని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆపరేషన్‌ కమల నిర్వహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేంతవరకు మౌనంగా ఉండిపోయిన బీజేపీ పెద్దలు ఆపై యడియూరప్పను అత్యంత అమానుషంగా పదవి నుంచి తొలగించిన సంగతిని డీకే శివకుమార్‌ గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి లింగాయత్‌లు ఈ దారుణాన్ని ఇంకా మర్చిపోలేదన్నారు. ఇంతకాలం లేని అప్యాయత యడియూరప్పపై ఒక్కసారిగా ప్రధానికి పుట్టుకురావడం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోందన్నారు.

శాసనసభలో యడియూరప్పను స్వయంగా ఆ పార్టీ నేతలే కన్నీరు పెట్టించిన సంగతిని ప్రజలు మర్చిపోలేదన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఇచ్చింది 104 సీట్లేనని పేర్కొన్న ఆయన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నీరు కారుస్తూ ఆపరేషన్‌ కమల నిర్వహించి అడ్డదారిలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఈ సంగతిని కూడా ప్రజలు మర్చిపోలేదన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఈ అన్ని అంశాలను మరోసారి ప్రజలకు తాము గుర్తుచేస్తామన్నారు. 40 శాతం కమీషన్ల వ్యవహారంతో ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసి ప్రతికూల పవనాలు వీస్తుండటంతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా పదే పదే రాష్ట్రానికి ఉరుకులు పరుగుల మీద పదేపదే వస్తున్నారని దీనిపైకూడా ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారని డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. లౌకిక ఓట్లు చీలిపోకుండా సాధ్యమైన మేరకు చిన్నా చితకా పార్టీలతో చర్చిస్తామని ఇందుకు ఇంకా సమయం ఉందని డీకే శివకుమార్‌ వెల్లడించారు.

ఇదికూడా చదవండి: ఆధార్‌ అనుసంధానానికి గడువు పెంచం!

Updated Date - 2023-03-01T11:38:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!