ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DK Shivakumar: మీరు పదే పదే పార్టీని రద్దు చేస్తామని ప్రకటిస్తే నేతలు, కార్యకర్తలు ఏమైపోవాలి?

ABN, First Publish Date - 2023-10-03T13:58:35+05:30

మీ పుత్రరత్నం పదేపదే పార్టీని రద్దు చేస్తామనో, రాజకీయ సన్యాసం తీసుకుంటాననో ప్రకటిస్తూంటే పార్టీనే నమ్ముకున్న నేతలు కార్యకర్తలు

- దళపతి దేవెగౌడకు డీసీఎం డీకే శివకుమార్‌ సూటి ప్రశ్న

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మీ పుత్రరత్నం పదేపదే పార్టీని రద్దు చేస్తామనో, రాజకీయ సన్యాసం తీసుకుంటాననో ప్రకటిస్తూంటే పార్టీనే నమ్ముకున్న నేతలు కార్యకర్తలు ఏమైపోవాలంటూ ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌(Deputy Chief Minister DK Shiva Kumar) దళపతి దేవెగౌడను సూటిగా ప్రశ్నించారు. బెంగళూరులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం చెన్నపట్టణ మాజీ ఎమ్మెల్యే ఎంసీ అశ్వధ్‌ సారథ్యంలో జేడీఎస్‌కు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఆర్‌ రామలింగారెడ్డి, జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎంపీ డీకే సురేష్‌ తదితరులు హాజరయ్యారు. పార్టీలోకి నేతలను సాదరంగా ఆహ్వానించిన అనంతరం డీకే మీడియాతో మాట్లాడారు. హెచ్‌డీ కుమారస్వామికి రాజకీయ సిద్ధాంతం అంటూ లేదని తెల్లవారితే ఏ పార్టీ గురించి మాట్లాడతారో తెలీదన్నారు. గాంధీ జయంతి రోజే కాంగ్రెస్‌ సిద్ధాంతాలపై అపార విశ్వాసం ఉంచి వచ్చిన నేతలను చేర్చుకుంటు న్నామన్నారు. రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీకైనా సిద్ధాంతాలు చాలా ముఖ్య మన్నారు. గతంలో కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది నేతలను జేడీఎస్‌లో చేర్చుకుని రాజకీయ ఆటలాడారని ఇప్పుడు అదే నోటితో ఏవేవో మాట్లాడు తున్నారంటూ ఆయన జేడీఎస్‌ నేతలపై మండిపడ్డారు.

Updated Date - 2023-10-03T13:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising