ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NEET : తమిళనాడుకు నీట్ నుంచి మినహాయింపు వచ్చే వరకు పోరాటం : సీఎం స్టాలిన్

ABN, First Publish Date - 2023-08-20T20:05:51+05:30

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. ఈ డిమాండ్‌తో ఆయన కుమారుడు, ఉదయనిధి నేతృత్వంలో రాష్టవ్యాప్తంగా నిరాహార దీక్షలు జరిగాయి.

MK Stallin, Tamil Nadu CM

చెన్నై : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నుంచి తమిళనాడుకు మినహాయింపు వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Chief Minister M K Stalin) చెప్పారు. ఈ డిమాండ్‌తో ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి నేతృత్వంలో రాష్టవ్యాప్తంగా నిరాహార దీక్షలు జరిగాయి. అయితే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. నీట్‌ను రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నాయి.

డీఎంకే ఆధ్వర్యంలో మధురైలో మినహా, రాష్ట్రవ్యాప్తంగా నీట్‌కు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు జరిగాయి. మధురైలో ఏఐఏడీఎంకే రాష్ట్ర స్థాయి సమావేశం పెద్ద ఎత్తున జరుగుతుండటంతో అక్కడ నిరాహార దీక్షలను ఈ నెల 23కు వాయిదా వేశారు. వల్లువర్ కొట్టంలో జరిగిన నిరసన దీక్షలలో డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి, సీనియర్ నేతలు దురైమురుగన్, మా సుబ్రహ్మణ్యం, పీకే శేఖర్ బాబు, దయానిధి మారన్, ఎమ్మెల్యేలు, చెన్నై మేయర్ ప్రియ ఆర్ పాల్గొన్నారు. నీట్ పరీక్షల భయంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించారు.

ఓ వివాహ మహోత్సవానికి హాజరైన స్టాలిన్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, నీట్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి తమ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నీట్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారన్నారు. నీట్‌కు వ్యతిరేకంగా ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఆమోదించిన బిల్లును తిప్పి పంపించారన్నారు. శాసన సభ జరుగుతున్నప్పటికీ అప్పటి అధికార పార్టీ ఆ విషయాన్ని బయటపెట్టలేదన్నారు. ఆ బిల్లు మురిగిపోయిందని చెప్పారు. తమ పార్టీ 2021 శాసన సభ ఎన్నికలకు ముందు నీట్ నిషేధానికి హామీ ఇచ్చిందన్నారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ప్రతిపాదించిన బిల్లును తాము అధికారం చేపట్టిన తర్వాత రెండుసార్లు ఆమోదించామన్నారు. ఎంతో పోరాటం తర్వాత దానిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినట్లు తెలిపారు. నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లుపై తాను సంతకం చేయబోనని గవర్నర్ ఆర్ఎన్ రవి ఇటీవల చెప్పడాన్ని స్టాలిన్ ఖండించారు. ఈ విషయం రాష్ట్రపతి వద్ద ఉందని, గవర్నర్ ఓ పోస్ట్‌మేన్ వంటివారని దుయ్యబట్టారు. శాసన సభ చేపట్టిన అంశాలను రాష్ట్రపతి భవన్‌కు చేరవేయడమే ఆయన పని అని ఎద్దేవా చేశారు.


ఇవి కూడా చదవండి :

China Occupation : ఇలా ఎవరూ మాట్లాడకూడదు.. రాహుల్ గాంధీపై మండిపడ్డ లెఫ్టిaనెంట్ జనరల్ (రిటైర్డ్) సంజయ్..

Congress : సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ.. గాంధీలతో పాటు సచిన్, థరూర్‌లకు చోటు..

Updated Date - 2023-08-20T20:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising