CJI : నాతో పరాచికాలొద్దు : సీజేఐ డీవై చంద్రచూడ్
ABN, First Publish Date - 2023-04-11T19:27:47+05:30
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) మంగళవారం ఓ న్యాయవాదిపై తీవ్ర
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) మంగళవారం ఓ న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అధికారంతో పరాచికాలు వద్దని స్పష్టం చేశారు. ఏప్రిల్ 17న విచారణ జరగవలసి ఉన్న కేసును మరింత ముందుగానే విచారణ జరపాలని ఆ న్యాయవాది పదే పదే కోరడంతో సీజేఐ ఘాటుగా స్పందించారు.
ఓ న్యాయవాది వాదనలు వినిపించవలసిన కేసు ఏప్రిల్ 17న విచారణకు సుప్రీంకోర్టు నిర్ణయించింది. అయితే అంత కన్నా ముందే ఈ కేసును విచారించాలని ఆ న్యాయవాది సీజేఐని కోరారు. ఈ కేసు విచారణ తేదీ ఈ నెల 17న ఉంది కదా? అని సీజేఐ అన్నారు. అయితే వేరొక ధర్మాసనానికి దీనిని బదిలీ చేయాలని ఆ న్యాయవాది కోరారు.
‘‘మీకు కేటాయించిన తేదీ 17, మీరు దీనిని 14న విచారణ జరిగేలా చేయడం కోసం వేరొక ధర్మాసనానికి బదిలీ చేయాలంటున్నారు’’ అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
‘‘ఇటువంటి కేసుపై సోమవారం విచారణ జరిపారు. కొన్ని కొత్త కేసులు కూడా వచ్చాయి’’ అని ఆ న్యాయవాది అన్నారు.
‘‘ఈ కేసు విచారణకు 17వ తేదీని నిర్ణయిస్తే, అది 17నే విచారణ జరుగుతుంది. నా అధికారంతో పరాచికాలు వద్దు’’ అని సీజేఐ చెప్పారు. ‘‘నా దగ్గర ఇలాంటి చిలిపి పనులు చేయకండి. మీరు ఇక్కడ మెన్షన్ చేసి, అంతకుముందే వేరొక చోట విచారణ కోసం అడగకండి’’ అన్నారు.
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వికాస్ సింగ్ మధ్య కూడా మార్చి నెలలో వాగ్వాదం జరిగింది. లాయర్స్ చాంబర్స్ కోసం భూమి కేటాయింపునకు సంబంధించిన విచారణలో ఈ సన్నివేశం కనిపించింది. ఈ కేసు విచారణ కోసం తేదీని ప్రకటించాలని ఆరు నెలల నుంచి కోరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని వికాస్ సింగ్ అన్నారు. సీజేఐ ధర్మాసనం వద్ద దీనిని లిస్టింగ్ చేయాలని కోరారు. దీనిని లిస్ట్ చేయకపోతే జడ్జి నివాసానికి తీసుకెళ్లవలసి వస్తుందన్నారు. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ, ‘‘ఇలాగేనా ప్రవర్తించేది?’’ అని అడిగారు. ‘‘మీరు నన్ను లొంగదీయలేరు’’ అన్నారు. 22 ఏళ్ళ నుంచి ఈ వృత్తిలో ఉన్నానని, తనను లొంగదీసే అవకాశాన్ని బార్ సభ్యులకు లేదా కక్షిదారులకు లేదా ఇతరులకు తాను ఇవ్వలేదన్నారు. తన వృత్తి జీవితంలోని చివరి రెండేళ్ళలో కూడా అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వబోనని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Arvind Kejriwal : జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండండి : కేజ్రీవాల్
BJP Vs Congress : సోనియా గాంధీ వ్యాసంపై బీజేపీ ఆగ్రహం
Updated Date - 2023-04-11T19:27:47+05:30 IST