ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Donate eyes: కళ్లు విలువ తెలిసిన అంధుడు

ABN, First Publish Date - 2023-02-16T10:20:41+05:30

అతనికి కళ్లు లేవు.. దీంతో అతనికి వాటి విలువ తెలుసు. తనకు చూపు లేకపోయినా మృతిచెందిన తన తల్లి కళ్ల ద్వారా మరొకరి జీవితంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మృతిచెందిన తల్లి నేత్రాలు దానం

పెరంబూర్‌(చెన్నై), ఫిబ్రవరి 15: అతనికి కళ్లు లేవు.. దీంతో అతనికి వాటి విలువ తెలుసు. తనకు చూపు లేకపోయినా మృతిచెందిన తన తల్లి కళ్ల ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు ప్రసాదించిన అంధుడి త్యాగనిరతికి పలువురు ప్రశంసిస్తున్నారు. నాగపట్టణం(Nagapattinam) జిల్లా మేల్‌కుర్చి కాళియమ్మన్‌ ఆలయ వీధికి చెందిన పళనివేల్‌, అంజలైఅమ్మాళ్‌ (65) దంపతులకు అశోక్‌కుమార్‌ అనే కుమారుడున్నాడు. అంజలై అమ్మాళ్‌ అనారోగ్యంతో గత ఆదివారం మృతిచెందగా, ఆమె కళ్లు దానంగా ఇవ్వాలని అశోక్‌కుమార్‌ నిర్ణయించారు. తండ్రి అంగీకారంతో ఆ రోజు రాత్రి నాగపట్టణం పోర్ట్‌ టౌన్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు షణ్ముగంను సంప్రదించాడు. తనకు ఏడాది వయస్సున్నప్పుడే జ్వరం వచ్చి, కంటి నరాలు దెబ్బతినడంతో పూర్తిగా చూపు కోల్పోయినట్లు, తన తల్లి కళ్లు దానం చేసి మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని అశోక్‌కుమార్‌ తెలిపారు. దీంతో, కుంభకోణంలోని అరవింద నేత్రాలయాన్ని షణ్ముగం సంప్రదించారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మేల్‌కుర్చి గ్రామానికి చేరుకున్న వైద్య బృందం, అంజలై అమ్మాళ్‌ కళ్లు సేకరించి వెళ్లారు. అశోక్‌కుమార్‌ సంకల్పాన్ని వైద్యులు, గ్రామస్తులు అభినందించారు.

Updated Date - 2023-02-16T10:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising