ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Double decker buses: నగరంలో.. త్వరలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు

ABN, First Publish Date - 2023-09-01T12:43:43+05:30

ఒకానొక కాలంలో బెంగళూరు రోడ్లపై ఆకర్షణగా సంచరించిన డబుల్‌డెక్కర్‌ బస్సు(Double decker buses) సర్వీసులను

- కొనుగోలుకు బీఎంటీసీ కసరత్తు..

- టెండర్లకు సన్నాహాలు..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఒకానొక కాలంలో బెంగళూరు రోడ్లపై ఆకర్షణగా సంచరించిన డబుల్‌డెక్కర్‌ బస్సు(Double decker buses) సర్వీసులను పునఃప్రారంభించేందుకు బీఎంటీసీ(BMTC) సిద్దమవుతోంది. ఈ ఏడాది ఆఖరుకు డబుల్‌డెక్కర్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకురాదలచారు. మరో 15 రోజులలోగా సర్వీసులు కొనుగోలు చేసేందుకు టెండర్‌లను ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా బీఎంటీసీ(BMTC) కసరత్తు సాగిస్తోంది. డబుల్‌డెక్కర్‌ బస్సులు అందుబాటులోకి వస్తే 26 ఏళ్ల తర్వాత పూర్వవైభవం తీసుకువచ్చినట్లు అవుతుంది. 1970-1980 మధ్యకాలంలో అప్పటి బీటీఎస్‌ సంస్థ డబుల్‌డెక్కర్‌లను ఆరంభించింది. వీటిలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపేవారు. అప్పట్లో మెజిస్టిక్‌ నుంచి గాంధీబజార్‌, శివాజీనగర్‌, శ్రీనగర్‌, కేఆర్‌ మార్కెట్‌(Gandhibazar, Shivajinagar, Srinagar, KR Market)ల మధ్యన తిరిగేవిరోడ్ల విస్తరణ లేకపోవడం, విద్యుత్‌ సహా పలలు తీగలు అడ్డుగా ఉండటం ప్రతిచోటా చెట్లకొమ్మలు అడ్డుగా వస్తున్నాయ ని 1997లో సర్వీసులను నిలిపివేశారు.

ప్రస్తుతం విశాలమైన రోడ్లతో పాటు దాదాపు ప్రధాన రహదారులలో అండర్‌గ్రౌండ్‌ వైరింగ్‌, కేబుల్‌ వ్యవస్థ రావడంతో గడిచిన మూడేళ్ళుగా డబుల్‌డెక్కర్‌(Double Decker) బస్సులను కొనుగోలు చేసే ప్రస్తావన తీసుకువస్తోంది. గడిచిన రెండుదశాబ్దాలలో బీఎంటీసీ బస్సులలో అత్యాధునిక సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. తొలివిడతలో పది సర్వీసులను కొనుగోలు చేయదలచారు. ఒక్కోబస్సును రూ.2.25 కోట్ల దాకా ఖర్చు చేయదలచారు. ఇందులో 90సీట్లు ఉంటాయని అంచనా వేశారు. ఇటీవల ఎలక్ట్రికల్‌ బస్సులకు కొనుగోలుకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే డబుల్‌ డెక్కర్‌ బస్సులు కూడా ఎలక్ర్టికల్‌గానే ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా పది బస్సులు వస్తే కీలకమైన ఐదు మార్గాలలో డబుల్‌డెక్కర్‌లను నడుపదలచారు.

Updated Date - 2023-09-01T12:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising