Dr. TRB Raja: మరికొద్దిసేపట్లో.. మంత్రిగా రాజా ప్రమాణస్వీకారం
ABN, First Publish Date - 2023-05-11T09:09:35+05:30
రాష్ట్ర మంత్రిగా తిరువారూర్ జిల్లా మన్నార్గుడి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ టీఆర్‌బీ రాజా(MLA Dr. TRB Raja) గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
చెన్నై, మే 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రిగా తిరువారూర్ జిల్లా మన్నార్గుడి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ టీఆర్‌బీ రాజా(MLA Dr. TRB Raja) గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో టీఆర్‌బీ రాజా చేత గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలు పార్టీలకు చెందిన నేతలు హాజరు కానున్నారు. పాడి పరిశ్రమల శాఖ మంత్రి ఎస్‌ఎం నాజర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించిన సీఎం.. కొత్తగా టీఆర్‌బీ రాజాకు చోటు కల్పించిన విషయం తెలిసిందే. ఆయన సిఫారసు మేరకు గవర్నర్.. రాజా చేత ప్రమాణం చేయించనున్నారు. డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు కుమారుడే టీఆర్‌బీ రాజా. డీఎంకే ఐటీ విభాగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజా... 2011, 2016 ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా మూడుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజాను మంత్రివర్గంలోకి తీసుకోవాలని స్టాలిన్ నిర్ణయించారు. ఇదిలా వుండగా ఆరుగురు మంత్రుల శాఖలు కూడా మారే అవకాశముందని తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పటికే సీఎం గవర్నర్ సిఫారసు చేసినట్లు తెలిసింది.
Updated Date - 2023-05-11T09:09:35+05:30 IST