Drinking water: వామ్మో.. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక మే నెలలో పరిస్థితి ఏంటో...
ABN, First Publish Date - 2023-10-27T12:38:27+05:30
పల్లెల్లో గొంతెండిపోతోంది.. బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు పడాల్సి వస్తోంది. బళ్లారి జిల్లా సండూరు తాలూకా అంతాపురం
బెంగళూరు: పల్లెల్లో గొంతెండిపోతోంది.. బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు పడాల్సి వస్తోంది. బళ్లారి జిల్లా సండూరు తాలూకా అంతాపురం(Antapuram) గ్రామంలో పంచాయతీ కొళాయిల్లో నీరు రాకపోవడంతో ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నారు. అయితే బిందె నీటి కోసం చిన్నా, పెద్ద అందరూ గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. వేసవిరాకముందే గ్రామంలో నీటి సమస్య తలెత్తడంతో మున్ముందు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - 2023-10-27T13:33:56+05:30 IST