ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Goa Hotel: విదేశీ వనితను లైంగికంగా వేధించి...కత్తితో పొడిచారు...

ABN, First Publish Date - 2023-03-31T12:08:24+05:30

విదేశీ టూరిస్టులకు స్వర్గథామంగా మారిన గోవాలోని ఓ హోటల్ లో దారుణం జరిగింది....

police arrest
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పనాజీ (గోవా): విదేశీ టూరిస్టులకు స్వర్గథామంగా మారిన గోవాలోని ఓ హోటల్ లో దారుణం జరిగింది.(Dutch Tourist Molested) ఓ విదేశీ వనితను లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెపై కత్తితో దాడి చేసిన ఘటన గోవాలో(Goa Hotel) వెలుగుచూసింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ మహిళా టూరిస్టును లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెపై కత్తితో దాడి చేసినందుకు(Stabbed By Goa Hotel Staff) గోవాలోని ఒక హోటల్‌ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ ఉద్యోగి డెహ్రాడూన్‌కు చెందిన అభిషేక్ వర్మ (27)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

మండ్రేమ్‌లోని విగ్వామ్ రిసార్ట్‌లో మధ్య రాత్రి ఈ సంఘటన జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ (నార్త్ గోవా) నిధిన్ వల్సన్ చెప్పారు.హోటల్ ఆవరణలో తాను అద్దెకు తీసుకున్న టెంట్‌లోకి 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడని డచ్ టూరిస్ట్ తన ఫిర్యాదులో పేర్కొంది. తాను కేకలు వేయడంతో ఆ వ్యక్తి తనను పట్టుకునేందుకు ప్రయత్నించాడని,ఆపై బెదిరించాడని బాధితురాలు చెప్పింది.ఆ తర్వాత కత్తితో తిరిగి వచ్చి ఆమెపై దాడి చేసి పారిపోయాడు.

ఇది కూడా చదవండి : Covid cases record: దేశంలో 24 గంటల్లో 3,095 కొవిడ్ కేసులు...ఈ ఏడాది రికార్డ్

గతంలోనూ జపాన్ దేశ మహిళను సైతం గోవాలో లైంగికంగా వేధించారు. హోలీ సందర్భంగా వేధింపులకు గురైన జపనీస్ మహిళ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లింది. పెర్నెం పోలీసులు విచారణలో భాగంగా అభిషేక్ వర్మను అదుపులోకి తీసుకున్నారు.నెదర్లాండ్స్ రాయబార కార్యాలయం ఈ సంఘటనను గుర్తించారు.డచ్ అధికారులు గోవాకు చేరుకున్నారు. గోవాలో విదేశీ వనితలను తరచూ లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఘటనల నేపథ్యంలో భారతదేశంలోని విదేశీ మహిళా పర్యాటకుల భద్రతపై ప్రశ్న లేవనెత్తింది.

Updated Date - 2023-03-31T12:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising