ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indonesia: ఇండోనేషియాలో మళ్లీ భూకంపం

ABN, First Publish Date - 2023-01-18T07:42:44+05:30

ఇండోనేషియా దేశంలో బుధవారం మరోసారి భూకంపం సంభవించింది....

Earthquake strikes Sulawesi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సులావేసి(ఇండోనేషియా): ఇండోనేషియా దేశంలో బుధవారం మరోసారి భూకంపం సంభవించింది.((Indonesia) ఇండోనేషియాలోని సులావేసిలో(Sulawesi) 145 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.(Earthquake) ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైందని యూరోపియన్ మెడిటెర్రేనియన్ సీస్మాలజీ సెంటర్ తెలిపింది. ఇండోనేషియా దేశంలో సోమవారం కూడా భూకంపం సంభవించింది.

సుమత్రా (Sumatra)ద్వీపం తీరంలో భూకంప కేంద్రం(Earthquake) అచే ప్రావిన్స్‌లోని సింగ్‌కిల్ నగరానికి దక్షిణ-ఆగ్నేయంగా 48 కిలోమీటర్ల దూరంలో 48 కిలోమీటర్ల లోతులో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది. ఇండోనేషియా దేశంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు సంభవిస్తున్నాయి.

గత ఏడాది నవంబర్ 21వతేదీన పశ్చిమ జావాలోని సియాంజూర్ నగరంలో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 331 మంది మరణించారు. ఈ భూకంపం వల్ల మరో 600 మంది గాయపడ్డారు. సులవేసిలో 2018వ సంవత్సరంలో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా 4,340 మంది మరణించారు.

Updated Date - 2023-01-18T07:42:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising