ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BMC COVID scam: ఏకంగా రూ.12 వేల కోట్ల కరోనా స్కాం.. రంగంలోకి ఈడీ

ABN, First Publish Date - 2023-06-21T16:44:17+05:30

కరోనా (Corona) విపత్తు సమయంలో వైద్య సదుపాయాలు, మెడిసిన్స్, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. అయితే ఈ విపత్కర సమయంలో ముంబై మహానగర పాలక సంస్థ బీఎంసీలో (Brihanmumbai Municipal Corporation) భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా రూ.12 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈడీ (ED) రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా (Corona) విపత్తు సమయంలో వైద్య సదుపాయాలు, మెడిసిన్స్, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. అయితే ఈ విపత్కర సమయంలో ముంబై మహానగర పాలక సంస్థ బీఎంసీలో (Brihanmumbai Municipal Corporation) భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా రూ.12 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈడీ (ED) రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహిస్తోంది.

వ్యాపారవేత్త సుజిత్ పాట్కర్‌తో సంబంధమున్న మనీల్యాండరింగ్ కేసుల సోదాలు నిర్వహిస్తున్నట్టు ఓ అధికారి చెప్పినట్టు సమాచారం. పాట్కర్, అతని ముగ్గురు భాగస్వాములు కరోనా సమయంలో బీఎంసీలో కొవిడ్-19 ఫీల్డ్ హాస్పిటల్స్ నిర్వహణను అనుమానాస్పదంగా దక్కించుకున్నారని ఓ అధికారి వివరించారు. దీంతో బీఎంసీకి చెందిన పలువురు అధికారులు, ఇతరుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. కొవిడ్-19 హాస్పిటల్స్ నిర్వహణతో సంబంధమున్న ఐఏఎస్ అధికారి సంజీవ్ జైస్వాల్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. కాగా లైఫ్‌లైన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్థ, పాట్కర్, అతని ముగ్గురు భాగస్వాములపై ఆజాద్ మైదాన్ పోలిస్ స్టేషన్‌లో ఆగస్టు 2022లో ఫోర్జరీ కేసు నమోదయ్యింది. కాగా స్కామ్‌లో బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ చాహాల్‌ను ఇదివరకే అధికారులు ప్రశ్నించారు.

కాగా కోవిడ్ సమయంలో హైదరాబాద్ హాస్పిటల్స్ నుండి ముంబై బీఎంసీకి మెడికల్ కిట్స్ సప్లై అయ్యాయి. దీంతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పలు మెడికల్ సంస్థలు కూడా ఇరుక్కున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌లో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆదిత్య థాక్రే సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు..

ఐఏఎస్ అధికారి సంజీవ్ జైస్వాల్‌తోపాటు ఇద్దరు శివసేన నేతల సన్నిహితుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. శివసేన(యూబీటీ)నేత ఆదిత్యా థాకరే(Aaditya Thackeray) అత్యంత సన్నిహితుడు సూరజ్ చౌహాన్(Suraj Chavan), ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) సన్నిహితుడు సుజిత్ పాట్కర్(Sujit Patkar) ఇళ్లు సహా థానే, నవీ ముంబై పరిసర ప్రాంతాల్లో మొత్తం 15చోట్ల ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. జైశ్వాల్ గతంలో థానే మున్సిపల్ కమిషనర్‌గా, కోవిడ్ సమయంలో BMC అదనపు కమిషనర్‌గా పనిచేశారు. దీంతో ఆయన ఇండ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది.


******************************

ఇవి కూడా చదవండి..

******************************

MLA Slapping engineer: ఇంజనీర్ చెంప చెళ్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే

******************************

Shashi Tharoor: ‘వరల్డ్ యోగా డే’ సందర్భంగా ఆ ప్రధానిని కూడా గుర్తుచేసుకోవాలి

******************************



Updated Date - 2023-06-21T16:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising