ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gangster: గ్యాంగ్‌స్టర్ ఇళ్లలో తనిఖీలు చేసిన ఈడీ...దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగు

ABN, First Publish Date - 2023-04-13T10:38:51+05:30

గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్, అతని అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం దాడులు...

Gangster, Atiq Ahmad,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్, అతని అనుచరుల ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం దాడులు చేశారు.(Gangster Atiq Ahmad) జైలులో ఉన్న అతీఖ్ అహ్మద్ కు చెందిన ప్రయాగరాజ్ నగరంలోని 15 ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేయగా నగదుతోపాటు పలు కీలకపత్రాలు లభించాయి. రూ.75 లక్షల ఇండియన్, విదేశీ కరెన్సీతో(ED seizes cash)పాటు పలు డాక్యుమెంట్లు దొరికాయి. అతీఖ్ అహ్మద్ కు 200 బ్యాంకుల్లో ఖాతాలున్నాయని(200 bank accounts), 50 షెల్ కంపెనీలున్నాయని(50 shell firms) ఈడీ దర్యాప్తులో తేలింది.

గ్యాంగ్ స్టర్ అతీఖ్ అహ్మద్ భూకబ్జాలు, ఇతర నేరాలతో పెద్ద ఎత్తున డబ్బు కూడగట్టాడని ఈడీ అధికారుల దాడుల్లో వెల్లడైంది. అతీఖ్ బినామీలైన అతని అనుచరుల పేర్లతో 100 ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో అతీఖ్ రూ.50కోట్లకు పైగా అక్రమ నగదు లావాదేవీలు జరిపాడని వెలుగుచూసింది. అతీఖ్ బంధువులైన ఖాలిద్ జాఫర్, అడ్వకేట్ సౌలత్ హనీఫ్ ఖాన్, అతని అనుచరులు అసద్, వదూద్ అహ్మద్,కాలీ, మోహసీన్, ఛార్టర్డ్ అకౌంటెంట్ సబీహ్ అహ్మద్, అసిఫ్ జాఫ్రీ, సీతారాం శుక్లా, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సంజీవ్ అగర్వాల్, దీపక్ భార్గవ్ ల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు జరిపారు.

ఇది కూడా చదవండి : Google: గూగుల్ టెక్ జెయింట్‌లో మరిన్ని లేఆఫ్‌లు... సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన

ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడడైన అతీఖ్ ను సబర్మతి జైలు నుంచి ప్రయాగరాజ్ కు తీసుకువచ్చారు. యూపీ పోలీసులు అతీఖ్ అహ్మద్ తో పాటు అతని సోదరుడు అష్రఫ్, భార్య షైష్ట పర్వీన్ , ఇద్దరు కుమారులు, అనుచరులు గుడ్డు ముస్లిం, గులాం మరో 9మందిపై కేసు నమోదు చేశారు. ఈడీ,ఐటీ, యూపీ పోలీసులు వేర్వేరుగా అతీఖ్ అహ్మద్ పై కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నాయి. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.

Updated Date - 2023-04-13T10:50:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising