ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Elections: అభ్యర్థుల ఎంపికకు కసరత్తు

ABN, First Publish Date - 2023-02-09T12:42:54+05:30

శాసనసభ ఎన్నికల నాటికి ప్రజలకు చేరువ కావాలని యాత్రలు, సభలతో బిజీగా గడుపుతున్న మూడు పార్టీల ముఖ్యనేతలు అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎన్నికల కార్యాచరణలో పార్టీలు

- మొదటి జాబితా ప్రకటించేసిన జేడీఎస్‌

- వేగం పెంచిన కాంగ్రెస్‌, బీజేపీ

- నిరంతరం జనంలో కార్యక్రమాలు

బెంగళూరు, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల నాటికి ప్రజలకు చేరువ కావాలని యాత్రలు, సభలతో బిజీగా గడుపుతున్న మూడు పార్టీల ముఖ్యనేతలు అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతం చేశారు. శాసనసభకు మే నెల మొదటి వారంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీన్నిబట్టి ఏప్రిల్‌లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈలోగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాలు, ఇతర వ్యవహారాలకు అవకాశం కల్పించాలని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ భావిస్తున్నాయి. రెండు పార్టీలకు ఈ ఎన్నికలు కీలకమైనవి. దక్షిణభారత్‌లో రెండు పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రం ఇదే. మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు సాధించడం ద్వారా ఆ తర్వాత ఎన్నికలు సులభతరం చేసుకోవాలని భావిస్తున్నాయి. జేడీఎస్‌ పార్టీ మనుగడకు

ఈ ఎన్నికలు కీలకమైనవి. ప్రస్తుతం వెనుకబడితే మళ్లీ కోలుకునే అవకాశమే ఉండదు. దాదాపు నెలన్నర కాలంగా మూడు పార్టీల ముఖ్యనేతలు ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. బస్సు యాత్రలతో కాంగ్రెస్‌ హోరెత్తిస్తుండగా జేడీఎస్‌ పంచరత్న పేరిట సుడిగాలిలా పర్యటిస్తోంది. బీజేపీ ప్రాంతాలవారీగా సభలు ఏర్పాటు చేసుకుంటూనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలు నిరంతరంగా కొనసాగిస్తున్నారు. జేడీఎస్‌ పార్టీ నెలక్రితమే 93 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌, బీజేపీ కూడా కసరత్తుకు సిద్ధమయ్యాయి. అధికార బీజేపీ కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌(Dharmendra Pradhan), రాష్ట్రంలో సుదీర్ఘకాలం ఐపీఎస్‌ అధికారిగా వ్యవహరించిన తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అణ్ణామలైను ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. వీరు జిల్లాల వారీగా అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జాతీయ పార్టీ నియోజకవర్గాల వారీగా సర్వేలు జరిపింది. వాటికి అనుగుణంగానే టికెట్లు కేటాయిస్తారు. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లాంటి ప్రయోగాలు లేకుండానే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో దాదాపు అందరికీ మరో చాన్స్‌ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం సర్వేలపై ఆధారపడుతూనే రాష్ట్రస్థాయి కమిటీలు నిరంతరంగా చర్చిస్తున్నాయి. ఈనెల 13న ఏఐసీసీ స్ర్కీనింగ్‌ కమిటీ బెంగళూరులో ప్రత్యేకమైన సమావేశం నిర్వహించనుంది. ఇందులో దాదాపు 200 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. కాంగ్రె్‌సకు 69 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇద్దరు ఇండిపెండెంట్‌లు మద్దతు ఇస్తున్నారు. ఇలా 71 మందికి మరోసారి టికెట్లు ఉంటాయనే సందేశాలు ఉన్నాయి. ఇక జేడీఎస్‌(JDS) పార్టీ తొలి విడతలో 93 మంది అభ్యర్థులను ప్రకటించగా మరికొన్ని రోజుల్లోనే రెండోజాబితా ప్రకటించే అవకాశం ఉంది. హాసన్‌లో కుటుంబ సమస్య తలెత్తడంతో అభ్యర్థుల ప్రకటనకు జాప్యమైంది. మూడు పార్టీలు దాదాపు సిట్టింగ్‌లకు టికెట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి.

కాగా ఢిల్లీ, పంజాబ్‌లో సత్తా చాటిన ఆమ్‌ ఆద్మీ పార్టీ తొలిసారి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనూ అభ్యర్థులను నిలిపేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రమంతటా అభ్యర్థులను బరిలో నింపే ఆలోచన లేకున్నా బెంగళూరులోని 28 శాసనసభ నియోజకవర్గాలతోపాటు అనుబంధ జిల్లాల్లో కసరత్తు సాగిస్తోంది. రాష్ట్రంలోని 30 జిల్లా కేంద్రాలతోపాటు కీలక నేతలు పోటీ చేసే ప్రతిచోటా ఆప్‌ అభ్యర్థులను పోటీ చేయించాలనే ప్రయత్నంలో ఉంది. ఇక దశాబ్దాల కాలంగా బీజేపీతో కలసి రాజకీయాలు చేసిన గాలి జనార్ధనరెడ్డి సొంత పార్టీతో బరిలోకి దిగుతున్నారు. బళ్లారి, కొప్పళ, రాయచూరు(Raichur) తదితర జిల్లాల్లో ఆయన అభ్యర్థులను పోటీ చేయించడానికి సిద్ధమవుతున్నారు. గాలి జనార్ధనరెడ్డి(Gali Janardhana Reddy) అభ్యర్థులను బరిలోకి దింపడం ద్వారా ఇతర పార్టీలపై ఏమేరకు ప్రభావం చూపనుందనేది వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఈనెలాఖరుకు మూడు పార్టీల అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఇదికూడా చదవండి: ప్రాణం పోయినా మార్పులేదు.. 24 గంటల్లోనే ఆ రెండు పథకాలు

Updated Date - 2023-02-09T12:42:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising