ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Elections: టికెట్ల కోసం జోరందుకున్న పైరవీలు

ABN, First Publish Date - 2023-04-02T08:28:45+05:30

శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌(Election Schedule) విడుదల కావడంతో టికెట్ల కోసం పైరవీలు జోరందుకున్నాయి. నియోజకవర్గ నేతలు రాష్ట్ర, జాతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌(Election Schedule) విడుదల కావడంతో టికెట్ల కోసం పైరవీలు జోరందుకున్నాయి. నియోజకవర్గ నేతలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నెల 13న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈలోగానే అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీలు కసరత్తు పెంచాయి. తొలి జాబితాలో కాంగ్రెస్‌ 124 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 70 మంది జాబితా సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరో 30 నియోజకవర్గాలకు రెండేసి పేర్లు ఉండడంతో క్లిష్టంగా మారింది. జేడీఎస్‌ పార్టీ 93 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించి దాదాపు రెండున్నర నెలలు పూ ర్తయింది. రెండో జాబితా కోసం తీవ్రమైన కసరత్తు చేస్తోంది. బీజేపీ అభ్యర్థుల జాబితా తేల్చేందుకు ఇంకా కార్యాచరణ చేస్తోంది. స్థానిక కార్యకర్తలు, పదాధికారులు, పార్టీ ముఖ్యుల అభిప్రాయాలు సేకరించి అభ్యర్థిని రంగంలోకి దించేందుకు బీజేపీ(BJP) ప్రయత్నిస్తోంది. శుక్రవారం 39 సంఘటనా జిల్లాలకు ఇద్దరు, ముగ్గురు చొప్పున పర్యవేక్షకులు వెళ్లి ఆశావహులైన అభ్యర్థుల సమాచారాన్ని సేకరించారు. ప్రతి నియోజకవర్గంలోనూ శక్తి కేంద్రం, మహాశక్తి కేంద్రం, హోబళి పదాధికారులు, రాష్ట్ర, జాతీయ పదాధికారులు, మహానగర పాలికె కార్పొరేటర్లు, మేయర్లు, జిల్లా, తాలూకా పంచాయతీ మాజీ సభ్యులతో కలసి 150 నుంచి 200 మంది అభిప్రాయాలను సేకరించారు. ప్రతి నియోజకవర్గానికి గరిష్టంగా ముగ్గురు అభ్యర్థులకు ఓటింగ్‌ విధానంతో అభిప్రాయాన్ని సేకరించారు. అభ్యర్థుల ఎంపిక కోసం బెంగళూరు శివారులోని ఓ రిసార్టులో శనివారం నుంచి కమిటీ సభలు ప్రారంభమయ్యాయి. ఆదివారం రాత్రి దాకా కొనసాగనున్నాయి.

బీజేపీ కసరత్తులో ప్రముఖులు

ఎన్నికల ఇన్‌చార్జ్‌, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, సహాయ ఇన్‌చార్జ్‌లు మన్‌సుఖ్‌ మాండవీయ, అణ్ణామలై, ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌, మాజీ సీఎం యడియూరప్ప(Former CM Yeddyurappa), పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ సభలో పాల్గొంటున్నారు. రెండు రోజులపాటు వీరు రిసార్టులోనే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు సాగించనున్నారు. ఈనెల 4 లేదా 5న కోర్‌ కమిటీ సమావేశంలో విస్తృతమైన చర్చ జరుగనుంది. పరిశీలన తర్వాత ఒక జాబితాను సిద్ధం చేయనున్నారు. 7న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుల సభలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈనెల 8 లేదా 10వ తేదీలోగా తొలి జాబితా ప్రకటించనున్నారు. తొలి జాబితాలోనే ఎక్కువ సీట్లు ప్రకటించే ఆలోచనలో బీజేపీ ఉంది. మిగిలిన స్థానాలకు చివరగా నామినేషన్‌లకు నాలుగైదు రోజుల ముందు బహిరంగం చేయనున్నారు.

వ్యూహాత్మకంగా జేడీఎస్‌ అడుగులు

జేడీఎస్‌ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తొలి జాబితాను సునాయాసంగానే పూర్తి చేసినా,... రెండో జాబితాలో హాసన్‌ అభ్యర్థి అంశం తలనొప్పిగా మారింది. రేవణ్ణ భార్య భవాని టికెట్‌ను ఆశించడం, కుమారస్వామి ససేమిరా అనడంతో కుటుంబంలో విభేదాలకు దారితీస్తోంది. తాజాగా శనివారం ఒక మంచి కార్యకర్తకు హాసన్‌ టికెట్‌ ఇస్తామని దేవెగౌడ ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ రెండు విడతల జాబితాలతో 140 మంది అభ్యర్థులను ప్రకటించింది. బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) 53 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్‌ఎస్‌) 50 మంది అభ్యర్థులతో జాబితాను సిద్ధం చేసింది. ఈనెల 10లోగానే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్‌ జాబితా

కాంగ్రెస్‌ పార్టీ రెండో జాబితాను దాదాపు సిద్ధం చేసింది. తొలి జాబితాలో 124 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మిగిలిన 100 స్థానాలకు మోహన్‌ ప్రకాశ్‌ అధ్యక్షతన గురువారం రాత్రి స్ర్కీనింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. వీటిలో 70 నియోజకవర్గాలకు ఒకే అభ్యర్థి పేరుతో రూపొందించారు. మరో 30 నియోజకవర్గాలకు రెండేసి పేర్లు ఉండడంతో ఒకరిని ఖరారు చేసేందుకు వారి ద్వారానే సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో రెండో జాబితా ప్రకటించాలని భావించారు. అయితే ఈనెల 5న రాహుల్‌గాంధీ కోలారుకు వస్తారని ఒకటి రెండు రోజులు అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసుకోవాలని భావించారు. కానీ రాహుల్‌ సభ 9వ తేదీకి వాయిదా పడ్డంతో ఈనెల 4న 70 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్‏లోకి బీజేపీ, జేడీఎ్‌సకు చెందిన పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్లు వస్తున్నందున ఆచితూచి టికెట్లు ఖరారు చేయాలని భావిస్తున్నారు.

Updated Date - 2023-04-02T08:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising