ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Elephant Gate Bridge: ఆగస్టు నాటికి ఎలిఫెంట్‌ గేట్‌ బ్రిడ్జి

ABN, First Publish Date - 2023-04-02T11:53:29+05:30

స్థానిక ఎలిఫెంట్‌ గేట్‌ రైల్వే బ్రిడ్జి మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుందని దక్షిణ రైల్వే(Southern Railway) అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెరంబూర్‌(చెన్నై): స్థానిక ఎలిఫెంట్‌ గేట్‌ రైల్వే బ్రిడ్జి మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుందని దక్షిణ రైల్వే(Southern Railway) అధికారులు తెలిపారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పరిధిలోని రాయపురం మండలం 57వ వార్డు పరిధిలో 1933లో నిర్మించిన ఈ బ్రిడ్జి నార్త్‌ చెన్నై(North Chennai), సెంట్రల్‌ చెన్నైను కలిపేలా ఏర్పాటైంది. ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో రూ.30.78 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించిన రైల్వే శాఖ, జీసీసీ తలా 50 శాతం నిధులు కేటాయించేందుకు నిర్ణయించాయి. 2019లో ఈ బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలు నిలిపివేయగా, నిర్మాణపనులు మాత్రం 2020లో ప్రారంభమయ్యాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఈ విషయమై ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌, ఈ బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే, జీసీసీ మేయర్‌ ప్రియ ఇటీవల బ్రిడ్జి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు.

నిర్మాణంలో జాప్యం...

బేసిన్‌ బ్రిడ్జి నుంచి చెన్నై సెంట్రల్‌ వైపుకు రైళ్లు వెళ్లేలా ఎనిమిది రైల్వేలైన్లు వున్నాయి. ఈ మార్గంలో నిత్యం సబర్బన్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తుంటాయి. దీంతో, బ్రిడ్జి నిర్మాణం సవాలుగా మారింది. రైలు పట్టాలపై ఎత్తుగా దిమ్మెలు ఏర్పాటు చేసి బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టారు. ఒక మార్గం తర్వాత మరొకటి చొప్పున ప్రస్తుతం ఆరు మార్గాలపై ఇసుప దిమ్మెలు ఏర్పాటుతో ఆయా మార్గాల్లో రైళ్లు యథావిధిగా సాగుతుండగా, మరోవైపు బ్రిడ్జి నిర్మాణం కూడా సాగుతోంది. మిగిలిన మార్గాలపై ఇనుప దిమ్మెలు ఏర్పాటుచేసే సమయంలో 30 నుంచి 40 రోజులు ఆ మార్గాన్ని నిలిపివేసి రైళ్లను పక్క మార్గంలో పంపేలా చర్యలు చేపట్టారు. ఈ పనులు పూర్తయి మరో మూడు నెలల్లో ఈ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చే అవకాశముందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-04-02T12:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising