Elon Musk: ప్రధాని మోదీతో ఎలాన్ మస్క్ భేటీ, భారత్‌లో పెట్టుబడులపై కీలక ప్రకటన
ABN, First Publish Date - 2023-06-21T09:47:12+05:30
అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ న్యూయార్క్‌లో ట్విట్టర్ సీఈవోఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తనను తాను మోదీ అభిమానిగా చెప్పుకున్న ఎలాన్ మస్క్ త్వరలో భారత్‌లో టెస్లా పెట్టుబడులపై కీలక ప్రకటన చేశారు.
న్యూఢిల్లీ: అమెరికాలో(America) పర్యటిస్తున్న ప్రధాని మోదీ ట్విట్టర్ సీఈవో(Twitter CEO) ఎలాన్ మస్క్‌తో(Elon Musk) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తనను తాను మోదీ అభిమానిగా చెప్పుకున్న ఎలాన్ మస్క్ త్వరలో భారత్‌లో టెస్లా పెట్టుబడులపై కీలక ప్రకటన చేశారు.
మంగళవారం న్యూయార్క్‌లో(New York) ప్రధాని మోదీ ట్విట్టర్ సీఈవో అధినేత ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురు పలు కీలక విషయాలపై చర్చించారు. భేటీ అనంతరం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు.. వచ్చే ఏడాది తాను భారత్‌లో పర్యటిస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. తనకు తాను మోదీకి అభిమానినని ఎలాన్ మస్క్ చెప్పారు. ప్రధాని మోదీ భారత్ అభివృద్ధిలో ప్రత్యేక దృష్టి సారించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మేం సరైన సమయంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఎలాన్ మస్క్ తెలిపారు.
ప్రధాని మోదీ అమెరికా పర్యటన
కాగా..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ఈనెల 24వరకు యూఎస్ఏలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో అమెరికాలోని పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నారు. నోబెల్ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులతో సహా వివిధ రంగాలకు చెందిన నేతలతో సమావేశం కానున్నారు.
Updated Date - 2023-06-21T11:06:10+05:30 IST