Cash for query row: మహువా మొయిత్రాపై చర్యకు ఎథిక్స్ కమిటీ కీలక సమావేశం
ABN, First Publish Date - 2023-11-05T18:29:50+05:30
డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పై చర్యకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ కమిటీ నవంబర్ 7న కీలక సమావేశం జరుపనుంది.
న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని ప్రశ్నలు వేశారన్న (Cash for query) ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై చర్యకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ (Ethics committee) కమిటీ నవంబర్ 7న సమావేశమవుతోంది. కమిటీ విచారణ ముగిసిందనడానికి సంకేతంగా ఈ కీలక సమావేశం జరగనుంది. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ అధ్యక్షతన కమిటీ ఈ ఆరోపణలపై విచారణ జరుపుతోంది.
ఎథిక్స్ కమిటీ సభ్యులు నవంబర్ 2న సమావేశం అయినప్పటికీ పార్టీలవారిగా విడిపోయారు. 15 మంది సభ్యుల కమిటీలో మెజారిటీ సభ్యులు బీజేపీకి చెందినవారే కావడంతో మహువా మొయిత్రాపై కఠిన చర్యలు ఉండవచ్చనే అభిప్రాయం ఉంది. సోంకర్ గత సమావేశంలో అనవసరమైన, వ్యక్తిగత ప్రశ్నలు అడిగారంటూ మొయిత్రా క్లెయిమ్ చేయడం, సోంకర్ ఆమె వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. మొయిత్రా సెంటిమెంట్లను కొందరు కమిటీ సభ్యులు నిలదీయడంతో పాటు నవంబర్ 2న జరిగే సమావేశం నుంచి వారు వాకౌట్ చేశారు.
అదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని తరఫున మొయిత్రా ఆయన వద్ద డబ్బులు తీసుకుని ప్రశ్నలు వేసేవారని నిషాకాంత్ డూబే ఆరోపణగా ఉంది. మొయిత్రా లాగిన్ క్రెడెన్షియల్స్ తీసుకుని దుబాయ్‌తో సహా వివిధ లొకేషన్ల నుంచి ఆయన ప్రశ్నలు సబ్మిట్ చేసినట్టు డూబే ఆరోపించారు. మొయిత్రా తన లాగిన్‌ను షేర్ చేసిన విషయాన్ని ఒప్పుకుంటూనే, ఆర్థిక లావాదేవీలు ఏవీ ఇందులో లేవని చెప్పారు. చాలా మంది ఎంపీలు తమ లాగిన్ సమాచారాన్ని ఇతరులతో షేర్ చేస్తుంటారని కూడా వివరణ ఇచ్చారు.
Updated Date - 2023-11-05T18:29:51+05:30 IST