Excise policy Case: సిసోడియా బెయిల్ పిటిషన్‌పై తీర్పు 28వ తేదీకి వాయిదా
ABN, First Publish Date - 2023-04-26T17:37:21+05:30
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో 'ఆప్' సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసిన..
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi Excise policy)కేసులో 'ఆప్' సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై (Bail Petition) తీర్పు వాయిదా పడింది. రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 28వ తేదీకి తీర్పును వాయిదా వేసింది. ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ తీర్పును వెలువరించనున్నారు. సిసోడియా బెయిల్ అభ్యర్థనపై ఈనెల 18వ తేదీని తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు.
దీనికి ముందు, ఈడీ తమ వాదనలను కోర్టుకు సమర్పించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి ప్రజామోదం ఉందని చూపించేందుకు నకిలీ ఈమెయిల్స్‌ను సిసోడియా సృష్టించినట్టు ఈడీ ఆరోపించింది. సోసిడియా కేసు విచారణ పూర్తికావడానికి నిర్దేశించిన 60 రోజుల గడువు ఇంకా పూర్తి కాలేదని కూడా కోర్టుకు తెలిపింది. ఈ కేసులో సిసోడియా ప్రమేయం ఉన్నట్టు తాజా సాక్ష్యాలు లభ్యమయ్యాయని, విచారణ కీలక దశలో ఉందని కోర్టుకు తెలియజేసింది.
సీబీఐ చార్జిషీటులో సిసోడియా..
కాగా, ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో మంగళవారంనాడు రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో తొలిసారిగా సిసోడియా పేరును సీబీఐ చేర్చింది. బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమన్‌దీప్ ధాల్ పేర్లను కూడా ఛార్జిషీటులో పేర్కొంది.
Updated Date - 2023-04-26T17:37:21+05:30 IST