ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amritsar: స్వర్ణ దేవాలయం వద్ద మూడోసారి పేలుడు

ABN, First Publish Date - 2023-05-11T09:06:51+05:30

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున పేలుడు జరిగింది....

Explosion near Golden Temple
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమృత్‌సర్‌: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున పేలుడు జరిగింది.(Explosion)కేవలం వారం వ్యవధిలో పరిసరాలను కుదిపేసిన మూడో పేలుడు ఘటన జరగడం సంచలనం రేపింది.ఈ పేలుడుకు కారణమైన ఐదుగురు నిందితులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.అమృత్‌సర్‌లోని (Amritsar)స్వర్ణ దేవాలయం(Golden Temple) ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే ఈ పేలుడు వెనుక ఉద్ధేశమని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి : Wedding: పెళ్లిలో డ్యాన్స్ చేస్తుండగా...ఏమైందంటే షాకింగ్

పేలుడు జరిగిన సమయంలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ సమీపంలోని గదిలో ఉన్నారని కూడా పోలీసు వర్గాలు తెలిపాయి.గురువారం నాటి పేలుడుకు కారణమైన క్రాకర్‌లో పొటాషియం క్లోరేట్‌ను ఉపయోగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.అంతకుముందు మే 6వతేదీ, మే 8 తేదీల్లో వరుసగా గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.రెండో పేలుడు జరిగిన ప్రదేశాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం కూడా సందర్శించి పరిశీలించింది.

Updated Date - 2023-05-11T09:45:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising