ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఫేస్‌బుక్‌ లవ్ స్టోరీ.. ఐఏఎస్ అధికారిణి అంటూ ప్రభుత్వ ఉద్యోగితో పెళ్లి.. కానీ ఆ తర్వాత..

ABN, First Publish Date - 2023-06-28T09:43:09+05:30

ఆగ్రాలో (Agra ) సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పీసీఏస్ (ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్) (Provincial Civil Service) అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న నోబుల్ కుమార్‌కు (Noble Kumar) ఫేస్‌బుక్‌లో (Facebook) కల్పనా మిశ్రా (Kalpana Mishra) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. కల్పన తనను తాను అండర్‌కవర్ ఐఏఎస్ ( Indian Administrative Service Officer) అధికారిణిగా పరిచయం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగ్రా: ఇంతకాలం అమ్మాయిలను అబ్బాయిలు మోసం చేసి పెళ్లి చేసుకున్న ఘటనలు చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అమ్మాయిలే అబ్బాయిలను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నారు. అసలు నిజం బయటపడ్డాక ఒకప్పుడు అమ్మాయిలు ఎలా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించే వారో ఇప్పుడు అబ్బాయిలకు కూడా అలాంటి పరిస్థితి తప్పడం లేదు. అచ్చం అలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. తనను తాను ఓ మహిళ ఐఏఎస్ (IAS) అధికారిణిగా చెప్పుకోని ఓ ప్రభుత్వ ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్ (PCS) అధికారిని పెళ్లి చేసుకోని మోసం చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాలో (Agra ) సేల్స్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పీసీఏస్ (ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్) (Provincial Civil Service) అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న నోబుల్ కుమార్‌కు (Noble Kumar) ఫేస్‌బుక్‌లో (Facebook) కల్పనా మిశ్రా (Kalpana Mishra) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. కల్పన తనను తాను అండర్‌కవర్ ఐఏఎస్ ( Indian Administrative Service Officer) అధికారిణిగా పరిచయం చేసుకున్నారు. కల్పన పోస్టింగ్, ఐఏఎస్ బ్యాచ్ గురించి నోబుల్ కుమార్ ఆరా తీసేందుకు ప్రయత్నించాడు. కానీ తన పోస్టింగ్ గోప్యతను పేర్కొంటూ సమాచారాన్ని పంచుకోవడానికి కల్పన నిరాకరించింది. అలా కల్పన, నోబుల్ మధ్య కొంతకాలం చాటింగ్ కొనసాగింది. తర్వాత ఒకరోజు నోబుల్ కుమార్‌కు కల్పన పెళ్లి ప్రపోజల్ పెట్టింది. దీంతో నోబుల్ కుమార్ కూడా పెళ్లికి అంగీకరించాడు. పెళ్లి షాపింగ్ కోసం కల్పనకు నోబుల్ కుమార్ రూ.71 వేలు ఇచ్చాడు.

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో ఉన్న ఆర్యసమాజ్‌లో నోబుల్, కల్పన వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. కల్పన కూడా భర్త ఇంటి నుంచే ఆఫీస్‌కు వెళ్లింది. పెళ్లయ్యాక కూడా నోబుల్ కుమార్ నుంచి కల్పన పలుమార్లు డబ్బులు తీసుకుంది. కానీ ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంటి నుంచి వెళ్లిపోయాక కూడా నోబుల్ కుమార్ నుంచి డబ్బులు తీసుకోవడం ఆపలేదు. దీంతో నోబుల్ కుమార్ ఆరా తీయగా కల్పన అసలు రూపం బయటపడింది. అప్పటికే వివాహిత అయిన కల్పన యూపీలోని మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అధికారిణిగా నటిస్తూ ఇతర అధికారులను కూడా ఇలాగే మోసం చేసింది. ఐఏఎస్ అధికారిణిని అని అబద్ధం చెప్పి పలువురిని ఇలానే మోసం చేసింది. అలాగే గతంలో లక్నో వాసిని కల్పన పెళ్లి చేసుకుంది. వారి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది.

తీరా మోసపోయానని తెలుసుకున్న నోబుల్ కుమార్.. పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కల్పనపై జాదీష్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పలు ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్(FIR) నమోదైంది. ప్రస్తుతం పోలీసులు కల్పనను పట్టుకునే పనిలో ఉన్నారు.

Updated Date - 2023-06-28T09:43:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising