Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కుమార్తె వివాహం అత్యంత నిరాడంబరంగా!
ABN, First Publish Date - 2023-06-09T10:26:08+05:30
పెళ్లిళ్లు అత్యంత అట్టహాసంగా, అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన కుమార్తె వివాహాన్ని
న్యూఢిల్లీ : పెళ్లిళ్లు అత్యంత అట్టహాసంగా, అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) తన కుమార్తె వివాహాన్ని బెంగళూరులోని తన నివాసంలోనే చాలా నిరాడంబరంగా జరిపించారు. పెద్ద స్థాయి రాజకీయ నేతలు ఎవరూ ఈ వేడుకలో పాల్గొనలేదు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరై, వధూవరులను ఆశీర్వదించారు.
నిర్మల సీతారామన్ కుమార్తె పరకాల వాఙ్మయీని ప్రతీక్ దోషికి ఇచ్చి గురువారం వివాహం చేశారు. ఈ వివాహం ఉడుపి అడమూరు మఠం ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో, అడమూరు మఠం వైదిక విధానంలో జరిగింది. ఈ మఠం అధిపతులు వధూవరులను ఆశీర్వదించారు. వాఙ్మయీ గులాబీ రంగు చీర, ఆకుపచ్చ జాకెట్ ధరించారు. వరుడు ప్రతీక్ తెల్లని పంచె, కండువా ధరించారు. నిర్మల సీతారామన్ మొలకల్మూరు చీర ధరించారు.
వరుడు ప్రతీక్ దోషి గుజరాత్‌కు చెందినవారు. సింగపూర్ మేనేజ్మెంట్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చాలా కీలకమైన సహచరుడు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పని చేసిన సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)లో 2014 నుంచి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పని చేస్తున్నారు. 2019 జూన్‌లో ఆయనకు జాయింట్ సెక్రటరీగా పదోన్నతి లభించింది.
వధువు వాఙ్మయీ మింట్ లాంజ్‌కు చెందిన బుక్స్ అండ్ కల్చర్ సెక్షన్లో ఫీచర్ రైటర్‌గా పని చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
BJP RSS: బీజేపీకి ఆర్ఎస్ఎస్ కీలక హెచ్చరిక.. ఆ రెండింటినే నమ్ముకుంటే పనికాదని కుండబద్ధలు..!
America : డొనాల్డ్ ట్రంప్‌పై ఏడు ఆరోపణలతో కేసు నమోదు
Updated Date - 2023-06-09T10:54:06+05:30 IST