West Bengal: బంతి అనుకుని బాంబుతో ఆడుకున్నారు...ఏం జరిగిందంటే...?
ABN, First Publish Date - 2023-06-20T13:28:19+05:30
పశ్చిమబెంగాల్ లోని ముర్షీదాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇమామ్‌నగర్‌లోని ప్లే గ్రౌండ్‌లో పిల్లలు ఆటలాడుతుండగా బాంబు పేలి ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. బంతి అనుకుని బాంబుతో ఆటలాడుతుండగా ఈ పేలుడు సంభవించినట్టు పోలీసులు మంగళవారంనాడు తెలిపారు.
ముర్షీదాబాద్: పశ్చిమబెంగాల్ (West Bengal) లోని ముర్షీదాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇమామ్‌నగర్‌లోని ప్లే గ్రౌండ్‌లో పిల్లలు ఆటలాడుతుండగా బాంబు పేలి (Bomb Explosion) ఐదుగురు చిన్నారులు గాయపడ్డారు. బంతి అనుకుని బాంబుతో ఆటలాడుతుండగా ఈ పేలుడు సంభవించినట్టు పోలీసులు మంగళవారంనాడు తెలిపారు.
స్థానిక వర్గాల కథనం ప్రకారం, సోమవారం మధ్యాహ్నం స్థానిక మేంగో గార్డెన్స్‌లో పిల్లలు అడుకుంటున్నారు. అక్కడ కనబడిన ఓ బాంబు బంతి ఆకారంలో ఉండటంతో దానితో ఆడటం మొదలుపెట్టారు. ఆ సమయంలో బాంబు పేలడంతో పిల్లలు గాయపడ్డారు. వెంటనే వారిని బెనియాగ్రామ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే ఫరక్కా పోలీస్ స్టేషన్ అధికారి దేబబ్రత చక్రవర్తి పోలీస్ టీమ్‌తో ఘటనా స్థలికి చేరుకున్నారు.
శాంతి భద్రతల క్షీణత...
కాగా, ప్లే గ్రౌండ్‌లో బాంబు పేలుడు ఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవహారం మరోసారి వెల్లడైందని విపక్షాలు విమర్శించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల నామినేషన్ పర్వంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బాంబులు, రాళ్లు రువ్వడాలు వంటి ఘటనలు చేటుచేసుకున్నాయి. గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఇటీవల అల్లర్లు జరిగిన సౌత్ 24 పరగణాల్లో పర్యటించి అక్కడి అల్లర్ల సమయంలో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జూన్ 8న పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, నామినేషన్ ప్రక్రియలో భాగంగా గత వారంలో చెలరేగిన అల్లర్లలో కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Updated Date - 2023-06-20T13:28:21+05:30 IST