ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sanatana Dharma: సనాతన ధర్మాన్ని అవమానిస్తున్న 'ఇండియా' కూటమి: అమిత్‌షా

ABN, First Publish Date - 2023-09-03T14:56:53+05:30

సనాతన ధర్మాన్ని ఇండియా కూటమి గత రెండు రోజులుగా విమర్శిస్తోందని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం డీఎంకే, కాంగ్రెస్ నేతలు సతానత ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ మాట్లాడుతున్నారని కేంద్రం హోం మంత్రి అమిత్‌షా అన్నారు. సనాతన ధర్మాన్ని వారు విమర్శించడం ఇదేమీ మొదటిసారి కాదని చెప్పారు.

జైపూర్: సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) ఇండియా (I.N.D.I.A.) కూటమి గత రెండు రోజులుగా విమర్శిస్తోందని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం డీఎంకే, కాంగ్రెస్ నేతలు సతానత ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ మాట్లాడుతున్నారని కేంద్రం హోం మంత్రి అమిత్‌షా అన్నారు. సనాతన ధర్మాన్ని వారు విమర్శించడం ఇదేమీ మొదటిసారి కాదని చెప్పారు. రాజస్థాన్‌లోని భనేశ్వర్ ధామ్ నుంచి రెండో 'పరివార్ సంకల్ప్ యాత్ర'ను అమిత్‌షా ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి ఈ యాత్ర ద్వారా చరమగీతం పాడనున్నట్టు చెప్పారు.


'సనాతన ధర్మం'పై గత రెండ్రోజులుగా ఇండియా కూటమి విమర్శలు గుప్పించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదేమీ వారికి కొత్తకాదన్నారు. దీనికి ముందు, బడ్జెట్‌పై తొలి హక్కు మైనారిటీలకు ఉందని మన్మోహన్ సింగ్ అన్నారని, అయితే మొదటి హక్కు పేదలు, గిరిజనులు, దళితులు, వెనుకబడిన వారికి ఉందని తాము తెగేసి చెప్పామని అన్నారు. ఈరోజు మోదీ ప్రభుత్వం గెలిస్తే సనాతన పాలన వస్తుందని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, రాహుల్ గాంధీ అయితే హిందూ సంస్థలను లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో పోలుస్తున్నారని, లష్కరో కంటే ప్రమాదకరమని అంటున్నారని అమిత్‌షా విమర్శించారు.


గిరిజనుల రిజర్వేషన్ పెంచాం..

గిరిజనులకు గతంలో 20 శాతం రిజర్వేషన్ ఉండేదని, రమణ్ సింగ్ సారథ్యంలోని గత బీజేపీ ప్రభుత్వం దానిని 32 శాతానికి పెంచేందుకు కృషి చేసిందని అమిత్‌షా చెప్పారు. గిరిజన కమ్యూనిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో రాహుల్ గాంధీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2023-09-03T15:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising