ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jai Shankar: పశ్చిమ దేశాలు చెడ్డవి కావు: విదేశాంగ మంత్రి జైశంకర్

ABN, First Publish Date - 2023-09-18T14:32:38+05:30

విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (Jai Shankar) పశ్చిమ దేశాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు చెడ్డవి కావు అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఈ దేశాలు ఆసియా, ఆఫ్రికన్ మార్కెట్లను తమ వస్తువులతో ముంచెత్తడంలేదని అన్నారు. కాబట్టి పశ్చిమ దేశాలను ప్రతికూలంగా భావించే ‘‘సిండ్రోమ్’’ను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.

తిరువనంతపురం: విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (Jai Shankar) పశ్చిమ దేశాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు చెడ్డవి కావు అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఈ దేశాలు ఆసియా, ఆఫ్రికన్ మార్కెట్లను తమ వస్తువులతో ముంచెత్తడంలేదని అన్నారు. కాబట్టి పశ్చిమ దేశాలను ప్రతికూలంగా భావించే ‘‘సిండ్రోమ్’’ను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ దేశాలతో ఎలాంటి సమస్య లేదని తన వైఖరిని స్పష్టం చేశారు. తద్వారా డ్రాగన్ దేశం చైనాపై పరోక్షంగా విదేశాంగమంత్రి విమర్శలు గుప్పించినట్టయ్యింది.


ఆసియా, ఆఫ్రికా దేశాల మార్కెట్లను వస్తువులతో ముంచెత్తుతున్నది పశ్చిమ దేశాలు కాదని జైశంకర్ అన్నారు. మరొవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలుగా వాటిని గుర్తించాలని అన్నారు. ప్రపంచం చాలా క్లిష్టంగా ఉంటుందని, సమస్యలు దాని కంటే చాలా క్లిష్టంగా ఉన్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ప్రారంభించిన ‘విశ్వకర్మ’ స్కీమ్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో తిరువనంతపురం వెళ్లిన ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత మాజీ దౌత్యవేత్త టీపీ శ్రీనివాసన్ మంత్రిని ఇంటర్వ్యూ చేయడం గమనార్హం.

Updated Date - 2023-09-18T14:32:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising