ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

G-20 Summit: శ్రీనగర్‌లో విదేశీ ప్రతినిధులకు సంప్రదాయ రీతిలో స్వాగతం

ABN, First Publish Date - 2023-05-22T18:18:13+05:30

జి-20 సదస్సుకు హాజరయ్యేందుకు కశ్మీర్ వస్తున్న విదేశీ ప్రతినిధులకు సాంప్రదాయ రీతిలో సాదర స్వాగతం లభిస్తోంది. శ్రీనగర్ విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన అతిథిలు జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ చేస్తున్న ఏర్పాట్లు చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోమవారంనాడు శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న విదేశీ అతిథులకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, అమితబ్ కాంత్ ఘనస్వాగతం పలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జి-20 సదస్సుకు హాజరయ్యేందుకు కశ్మీర్ వస్తున్న విదేశీ ప్రతినిధులకు సాదర స్వాగతం లభిస్తోంది. శ్రీనగర్ విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన అతిథిలు జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ చేస్తున్న ఏర్పాట్లు చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భారతీయత ఉట్టిపడే విధంగా, కశ్మీర్ సంప్రదాయాలతో స్థానికులు, కేంద్ర మంత్రులు వీరికి స్వాగతం పలుకుతున్నారు. సోమవారంనాడు శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న విదేశీ అతిథులకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, అమితబ్ కాంత్ ఘనస్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలతో, అతిథులకు మంగళ తిలకాలు దిద్ది స్వాగతం పలికారు.

శ్రీనగర్‌లో సోమవారం ప్రారంభమైన మూడవ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈనెల 24వ తేదీ వరకూ జరగనుంది. జీ20 సభ్య దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. మూడురోజుల ఈ కార్యక్రమం కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), సశాస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి). జమ్మూ కాశ్మీర్ పోలీసులతో భద్రత, ఏరియల్ నిఘా కట్టుదిట్టం చేశారు. జి20 ప్రతినిధులు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ కదలికపై కూడా ఆంక్షలు విధించారు. లాల్ చౌక్ ఏరియాలోని దుకాణాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దుకాణాలు తెరిచి ఉంచేందుకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. ఈ సదస్సును పాకిస్థాన్ బహిష్కరించగా, చైనా కూడా ఇదే బాట పట్టింది. వివాదాస్పద ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించడాన్ని తాము వ్యతిరేకిస్తు్న్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటనపై భారత్ అగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - 2023-05-22T18:18:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising