Former Chief Minister: ఎన్నికలవేళ బీజేపీ రిజర్వేషన్ల జిమ్మిక్కు
ABN, First Publish Date - 2023-03-26T09:27:38+05:30
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్సీ, ఎస్టీలు, లింగాయతులు, ఒక్కలిగలకు రిజర్వేషన్‌ల పేరిట బీజేపీ రాజకీయ నాటకానికి తెరలేపిందని
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్సీ, ఎస్టీలు, లింగాయతులు, ఒక్కలిగలకు రిజర్వేషన్‌ల పేరిట బీజేపీ రాజకీయ నాటకానికి తెరలేపిందని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(Former Chief Minister Kumaraswamy) విరుచుకుపడ్డారు. ఈమేరకు శనివారం ఆయన వరుస ట్వీట్‌లు చేశారు. బీజేపీ వారిని కౌరవులతో పోల్చిన ఆయన బీజేపీ రిజర్వేషన్‌లు పచ్చిదగా అంటూ ట్యాగ్ చేశారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే రిజర్వేషన్‌ల జిమ్మిక్కులను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రిజర్వేషన్ అనే నిప్పులతో బీజేపీ చెలగాటం ఆడు తోందని పేర్కొన్న ఆయన ఆ పార్టీ పాపాలు పండాయని వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. మైనారిటీలకోసం ఉద్దేశించిన రిజర్వేషన్‌లను తొలగించి వారిని ఈబీసీలో చేర్చడం కంటి తుడుపు చర్యలో భాగమన్నారు. బీజేపీ ప్రకటించిన రిజర్వేషన్‌లతో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల వేళ హడావుడిగా నిర్ణ యాలు తీసుకోవడం గమనిస్తే కేవలం ఓట్ల రాజకీయాలకోసమేనన్న విషయం బోధపడుతోందన్నారు.
నేడు మైసూరులో పంచరత్నయాత్ర ముగింపు ర్యాలీ
జేడీఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంచరత్న రథయాత్ర ముగింపు సమావేశం సాంస్కృతిక నగరి మైసూరులో ఆదివారం జరగనుందని కుమారస్వామి తెలిపారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లా డుతూ ఈ ర్యాలీకి పది లక్షలమందికిపైగా హాజరు కాగలరని అంచనా వేస్తున్నా మన్నారు. మైసూరులోని ఉత్తనహళ్ళి రింగ్‌రోడ్డు వద్ద 100 ఎకరాల విశాలమైన ప్రదేశంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. అంతకుముందు కొలంబియా ఏషియా ఆసుపత్రి రింగ్ రోడ్డు నుంచి భారీ రోడ్‌షో జరుగుతుందని మాజీ ప్రధాని దేవేగౌడ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం తదితరులు పాల్గొంటారన్నారు. పంచరత్న హామీల రథాలను విద్యుద్దీపాలతో అలంకరించామన్నారు. ప్రజలం దరికీ భోజన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గత ఏడాది నవంబరు 18 నుంచి మార్చి 24వరకు నిర్వహించిన పంచరత్న రథయాత్రలకు భారీ స్పందన లభించిందన్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆదివారం జరిగే ర్యాలీ ఓ మైలురాయి కానుందన్నారు.
Updated Date - 2023-03-26T09:27:38+05:30 IST