ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Former Chief Minister: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఐఏఎస్‏లను బానిసలుగా మార్చేశారు..

ABN, First Publish Date - 2023-07-19T12:07:47+05:30

బెంగళూరు సమావేశానికి హాజరైన ప్రతిపక్షనేతలను ఆహ్వానించేందుకు ఐఏఎస్‏లను రంగంలోకి దించడం చట్టవిరుద్ధమని మాజీ ముఖ్యమం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు సమావేశానికి హాజరైన ప్రతిపక్షనేతలను ఆహ్వానించేందుకు ఐఏఎస్‏లను రంగంలోకి దించడం చట్టవిరుద్ధమని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం వరుస ట్వీట్లు చేసిన ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థపైనే నమ్మకం ఉన్న కాంగ్రెస్‌ ఐఏఎస్‌ అధికారులతో వెట్టి చేయిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ తాను ఇలాంటివి ఎరుగనన్నారు. అధికారంలో ఉన్నవారిని ఆహ్వానించడం వరకు ఫర్వాలేదని, కానీ మాజీ సీఎంలను ఆహ్వానించేందుకు ఐఏఎస్‏లను పురమాయించడం సరికాదన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, వర్షాభావ హాహాకారాలు ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం, ప్రతిపక్ష సమావేశం విషయంలో తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డం దారుణమన్నారు. కాగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) స్పందిస్తూ ప్రతిపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. ఇతర రాష్ట్రాల ప్రముఖులు రాష్ట్రానికి విచ్చేసినప్పుడు ప్రొటోకాల్‌ ప్రకారం వారికి స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోందన్నారు. చాలాకాలంగా అమలులో ఉన్న ఈ విధానాన్ని తామూ పాటించామన్నారు. ఎక్కడా ప్రొటోకాల్‌ ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. ప్రతిదాన్ని రాజకీయకోణంలో చూడ్డం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు.

అతిథులుగా స్వాగతించాం: సీఎం

బెంగళూరుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు విచ్చేశారని, వారిని అతిథులుగా పరిగణించి ప్రొటోకాల్‌ ప్రకారం స్వాగతించేందుకు అధికారులను కేటాయించామని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. గతంలో కొనసాగిన విధానాన్నే తాము అనుసరించామని, రాజకీయ కార్యక్రమాలకు అధికారులను కేటాయించలేదని స్పష్టం చేశారు.

Updated Date - 2023-07-19T12:09:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising